Adani Loans: అదానీ గ్రూప్ ఎక్కువగా రుణాలను కలిగి ఉందని.. వాస్తవ విలువ కంటే ఎక్కువ లెవరేజ్ పొందిందంటూ గతంలో అనేక వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఆ సమయంలో చాలా రుణాలను కంపెనీ గడువు కంటే ముందే చెల్లించి తన బలాన్ని నిరూపించుకుంది.
వచ్చే ఏడాది 1.9 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ బాండ్‌లు మెచ్యూర్ అవుతుండటంతో.. అదానీ గ్రూప్ నగదు చెల్లింపులు, కొత్త బాండ్ విక్రయాల ద్వారా రుణ రీఫైనాన్సింగ్ పూర్తి చేయాలని చూస్తోంది. ఇందుకోసం ప్రణాళికలను రూపొందిస్తోంది. 2019లో విక్రయించిన అదానీ గ్రీన్ హోల్డింగ్ కంపెనీ బాండ్లలో 750 మిలియన్ డాలర్లను తిరిగి చెల్లించడానికి, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మెచ్యూర్ అయ్యే నగదు, నగదుకు సమానమైన లిక్విడిటీ పూల్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు గ్రూప్ రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ద్వారా పెట్టుబడిదారులకు తెలిపింది.

జూలై నాటికి అదానీ పోర్ట్స్‌కి చెందిన 650 మిలియన్ డాలర్ల రుణ చెల్లింపులను నగదు రూపంలో చెల్లించటానికి సైతం అదానీ గ్రూప్ కట్టుబడి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ ఏడాది 325 మిలియన్ డాలర్ల నగదును చెల్లించింది. మే నెలలో మెచ్యూర్ అయ్యే అదానీ గ్రీన్ 500 మిలియన్ డాలర్ల బాండ్ ట్రాంచ్ రీఫైనాన్స్ కోసం 410 మిలియన్ డాలర్లను సమీకరించడానికి రుణదాతలతో గ్రూప్ చర్చలు ప్రారంభించింది. అయితే 20 ఏళ్ల కాలానికి దీర్ఘకాలిక నిధులను సమీకరించటానికి సంభావ్య పెట్టుబడిదారులతో గ్రూప్ చర్చలు ప్రారంభించిందని వర్గాలు తెలిపాయి.
బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం మెుత్తం అదానీ గ్రూప్ సంస్థలు సుమారు 7.5 బిలియన్ డాలర్ల బాండ్ల రుణాలను కలిగి ఉన్నాయి. హోల్డింగ్ కంపెనీలతో పోలిస్తే, నగదు ప్రవాహాన్ని సృష్టించే ఆపరేటింగ్ కంపెనీలలో రీఫైనాన్సింగ్ సాధారణంగా సులభమని, ఇది అదానీ గ్రూప్ రీపేమెంట్ వ్యూహం కావచ్చునని విశ్లేషకులు తెలిపారు. APSEZ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు, నాన్-క్యుములేటివ్ రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అదనంగా రూ.250 కోట్లు సమీకరించే ప్రణాళికలను మంగళవారం ప్రకటించింది.
కంపెనీ గుజరాత్‌లోని అతిపెద్ద కంటైనర్ హ్యాండ్లింగ్ పోర్ట్ ముంద్రాతో సహా భారతదేశం అంతటా 13 పోర్ట్‌లు, టెర్మినల్‌లను నిర్వహిస్తోంది. అలాగే అదానీ పోర్ట్స్ శ్రీలంకలోని ఒక కంటైనర్ టెర్మినల్ కోసం ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 553 మిలియన్ డాలర్ల రుణాన్ని పొందింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications