Adani Airports IPO: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఐపీవో రష్ సమయంలో పెద్ద వ్యాపార సంస్థలు సైతం తమ కంపెనీలను లిస్టింగ్ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇన్వెస్టర్లు సైతం డబ్బు రెడీ చేసుకుంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎదురుచూస్తున్నారు.
అయితే దేశంలోని చాలా మంది పెట్టుబడిదారులకు అదానీ గ్రూప్ అంటే చాలా ఇష్టం. అదానీ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లను హోల్డ్ చేస్తూ చాలా మంది ఇప్పటికే ధనవంతులుగా మారారు. ఈ క్రమంలో గౌతమ్ అదానీకి చెందిన మరో కంపెనీని పబ్లిక్ లిస్టింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే అదానీ గ్రూప్ ఫ్లాట్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన ఎయిర్‌పోర్ట్ వ్యాపారాన్ని 2027-28 ఆర్థిక సంవత్సరానికి ఐపీవోగా తీసుకొచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ ఈక్విటీల ద్వారా 2-3 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 1994లో ఫ్లాగ్‌షిప్ కంపెనీ పబ్లిక్‌గా మారినప్పటి నుంచి పోర్ట్స్-టు-ఎనర్జీ వరుక వ్యాపారాలను కలిగి ఉన్న అదానీ మాతృ సంస్థ ఆరు ఇతర స్వతంత్ర వ్యాపారాలను పొదిగించటంతో పాటు వాటిని స్టాక్ మార్కెట్లలో విజయవంతంగా లిస్టింగ్ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాప్ దాదాపు 10 బిలియన్ డాలర్లకు పైగా చేరుకున్నాయి.
త్వరలో ఐపీవోగా అదానీ గ్రూప్ తీసుకురావాలనుకుంటున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశంలో 8 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. అయితే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సంవత్సరం చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. పోర్ట్స్ నుంచి ఎనర్జీ, ఎయిర్ పోర్ట్స్, కమోడిటీలు, సిమెంట్, మీడియా వరకు ఉన్న పోర్ట్‌ఫోలియో కంపెనీల పెట్టుబడిలో 70 శాతం అంతర్గత నగదు ఉత్పత్తి ద్వారా, మిగిలిన మొత్తాన్ని రుణ సాధనాల ద్వారా తీర్చవచ్చని అదానీ గ్రూప్ CFO జుగేషీందర్ 'రాబీ' సింగ్ తెలిపారు. అలాగే అదానీ గ్రూప్ తన పోర్ట్‌ఫోలియో కంపెనీల్లో ఎఫ్‌వై 25లో సుమారు రూ.1.3 లక్షల కోట్లను పెట్టుబడి రూపంలో పెట్టాలని చూస్తోంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications