Cement Business: దేశంలో ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అదానీ సైతం దూకుడు పెంచుతున్నారు. ఎన్డీయే సర్కార్ కీలకంగా మౌలికసదుపాయాల కల్పనపై దృష్టి సారించటంతో తన బిజినెస్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇది బిర్లాలకు టెన్షన్ పెంచేస్తోంది.
బిర్లాకు చెందిన టెలికాం వ్యాపారం ఐడియాను ఇప్పటికే నష్టాల్లోకి ముఖేష్ అంబానీ జియో నెట్టేయగా.. మరోపక్క సిమెంట్ వ్యాపారంలో అదానీ ఊపిరి సలపనివ్వటం లేదు. తాజాగా.. అదానీ గ్రూప్ తన సిమెంట్ వ్యాపారంపై పూర్తి దృష్టి పెట్టింది. సిమెంట్ వ్యాపారాన్ని విస్తరించేందుకు గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. అదానీ గ్రూప్ అనేక సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేయగలదని, దీని కోసం అనువైన కంపెనీల కోసం అన్వేషన కొనసాగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే హైదరాబాద్ ఆధారిత పెన్నా సిమెంట్, గుజరాత్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సౌరాష్ట్ర సిమెంట్, జైప్రకాష్ అసోసియేట్స్‌తో పాటు ABG షిప్‌యార్డ్ యాజమాన్యంలోని వడరాజ్ సిమెంట్ అదానీ గ్రూప్ కొనుగోలు చేయాలనుకుంటున్న సిమెంట్ కంపెనీల లిస్టులో ఉన్నాయి. ఈ సిమెంట్ కంపెనీల మెగా షాపింగ్ కొనుగోలు కోసం అదానీ గ్రూప్ 3 బిలియన్ డాలర్ల మొత్తాన్ని కేటాయించిందని నివేదికలు చెబుతున్నాయి. రానున్న 3-4 ఏళ్లలో అదానీ సిమెంట్ వ్యాపారాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ను అధిగమించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచడానికి, అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా అవతరించడానికి సమూహం దూకుడుగా అకర్బన వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రూప్ కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్న సిమెంట్ కంపెనీలైన జైప్రకాష్ అసోసియేట్స్, వడరాజ్ సిమెంట్ ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్నాయి. జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ICICI బ్యాంక్‌కు నోటీసు జారీ చేసింది. జూన్ 24 లోగా కంపెనీ సమర్పించిన వన్-టైమ్ సెటిల్‌మెంట్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ కంపెనీకి మొత్తంగా రూ.26,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.
అదానీ గ్రూప్ ఇంతకుముందు సిమెంట్ కంపెనీ సంఘీ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ క్లింకర్, సిమెంట్ తయారీ వ్యాపారంలో ఉంది. ఇది గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని అబ్దాసా తాలూకాలోని సంఘీపురంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ స్ట్రీమ్ సిమెంట్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తోంది. అదానీ గ్రూప్ ఇంతకుముందు అంబుజా, ACC సిమెంట్‌లను $10.5 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేయగా.. ప్రస్తుతం సిమెంట్ వ్యాపారంలో ఆ దూకుడును కొత్త కొనుగోళ్లతో కొనసాగించాలని గౌతమ్ అదానీ చూస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications