GQG Partners: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో అమెరికాకు చెందిన రాజీవ్ జైన్‌కు చెందిన GQG పార్టనర్స్ భారీగా పెట్టుబడులు పెట్టి ప్రస్తుతం ఆ ఫలాలను అందుకుంటున్నారు.
అదానీ షేర్లపై ఇన్వెస్టర్లకు నమ్మకం కుప్పకూలిన వేళ రక్షకుడిగా అదానీ గ్రూప్ పతనాన్ని అడ్డుకుంది రాజీవ్ జైన్ పెట్టుబడులే. తాజాగా GQG పార్టనర్స్ ఇప్పుడు GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో దాదాపు ఐదు శాతం వాటాను రూ.1,672 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీ ఈ వాటాను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది. బల్క్ డీల్ డేటా ప్రకారం GQG పార్టనర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్ 92,636,787 షేర్లను, గోల్డ్‌మన్ సాక్స్ GQG పార్టనర్స్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఫండ్ 19,02,45,637 షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

ఈ కొనుగోలు ఒక్కో షేరుకు రూ.59.09 రేటుకు జరిగింది. దీంతో శుక్రవారం కంపెనీ షేర్ ధర గణనీయంగా పెరిగి 14 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో ట్రేడింగ్ సమయంలో ఇంట్రాడే గరిష్ఠమైన రూ.70.40ను స్టాక్ తాకింది. వాస్తవానికి ఇది 2009 తర్వాత అత్యధిక స్థాయని చెప్పుకోవచ్చు. చివరికి స్టాక్ దాదాపు 12 శాతం లాభంతో బీఎస్ఈలో రూ.68.89 వద్ద ముగిశాయి.
ఈ సంవత్సరం GMR ఎయిర్‌పోర్ట్స్ దాని పెట్టుబడిదారులకు 73% కంటే ఎక్కువ రాబడిని అందించింది. మూడేళ్లలో ఈ షేరు ధర 190 శాతానికి పైగా రాబడిని అందించింది. సెప్టెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి కంపెనీలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల వాటా 28%గా ఉంది. GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.190 కోట్ల నష్టాన్ని చవిచూసింది.


Click it and Unblock the Notifications