Adani News: బయటపడ్డ అదానీ దొంగ రూటు.. కొత్త సంస్థ ఇన్వెస్టిగేషన్ వాస్తవాలు..!!
Adani News: అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక చాలా నెలలు అదానీ గ్రూప్ కంపెనీలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపైనే దర్యాప్తు పూర్తి కాకుండానే మరో రిపోర్ట్ సంచలనాలు సృష్టిస్తోంది.
అస్పష్టమైన మారిషస్ Opaque ఫండ్స్ ద్వారా అదానీ కుటుంబం భారతదేశంలోని అదానీ గ్రూప్ ఈక్విటీల్లో మిలియన్ల కొద్ది డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) గురువారం ఒక కథనంలో తెలిపింది. దీనికి బహుళ టాక్స్ హెవెన్స్, అదానీ గ్రూప్ అంతర్గత ఈమెయిల్స్ ద్వారా సేకరించిన సమాచారం దీనికి సాక్ష్యమని సంస్థ పేర్కొంది.

ఆఫ్‌షోర్ సంస్థల ద్వారా అదానీ స్టాక్‌లను కొనుగోలు చేసి విక్రయించిన కనీసం రెండు కేసులను తమ దర్యాప్తులో కనుగొన్నట్లు లాభాపేక్షలేని మీడియా సంస్థ OCCRP తెలిపింది. ఈ కథనం అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక విడుదలైన ఎనిమిది నెలలకు తాజాగా బయటకు వచ్చింది. గతంలో హిండెన్ బర్గ్ నివేదికను దురుద్దేశ పూరితమైనదిగా, నిరాధారమైనదిగా అదానీ గ్రూప్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.

అయితే గతంలో రిపోర్టు తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ల క్యాప్ జనవరి తర్వాత 150 బిలియన్ డాలర్ల మేర ఆవిరైంది. అయితే ఇటీవల గ్రూప్ తన అప్పుల భారాన్ని కొంత తగ్గించుకోవటం, విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించటం వంటి పనులతో ఇన్వెస్టర్ల నమ్మకం పెరిగి స్టాక్స్ లాభపడ్డాయి. అయితే ఇదంతా మూనాళ్ల ముచ్చటిగా మారిపోతుందేమోనని అనిపిస్తోంది. అదానీ గ్రూప్ ఇప్పటి వరకు ఈ నివేదికపై ఎలాంటి ప్రకటన లేదా స్పందన చేయలేదు. బిలియనీర్ గౌతమ్ అదానీని హిండెన్‌బర్గ్ నివేదిక గతంలో తీవ్రంగా దెబ్బతీయగా.. మళ్లీ అలాంటి పరిస్థితులు వచ్చినట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications