భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్‌కి చెందిన సిమెంట్ కంపెనీ ACC లిమిటెడ్ పై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) రెండు వేర్వేరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తం రూ. 23.07 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా ఉత్తర్వులను కంపెనీ అక్టోబర్ 1, 2025న స్వీకరించింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తామని, వీటి ప్రభావం తమ ఆర్థిక కార్యకలాపాలపై ఉండదని స్పష్టం ACC చేసింది.
ఈ జరిమానాలు ACC కంపెనీ అదానీ గ్రూప్‌లో విలీనం కానున్న కంటే ముందు కాలానికి సంబంధించినవి. ఆదాయపు పన్ను శాఖ 2015-16, 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరాలకు వేర్వేరుగా జరిమానాలు విధించింది.మొదటి జరిమానా (అసెస్‌మెంట్ ఇయర్ 2015-16) కాలానికి సంబంధించినది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, ACC.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 49.25 కోట్ల ఖర్చును క్లెయిమ్ చేసింది. కానీ ఈ ఖర్చులను శాఖ అంగీకరించలేదు. ఫలితంగా ఆదాయాన్ని తప్పుగా చూపించిందని నిర్ణయించి, సంబంధిత పన్ను బాధ్యతపై రూ. 14.22 కోట్ల జరిమానా విధించింది. ఈ చర్యను "తప్పుడు ఆదాయ వివరాల సమర్పణ" కింద వర్గీకరించారు.

ఇక రెండవ జరిమానా (అసెస్‌మెంట్ ఇయర్ 2018-19) విషయానికి వస్తే.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ACC.. రూ. 12.79 కోట్ల ఖర్చును క్లెయిమ్ చేసినప్పటికీ, ఆదాయపు పన్ను శాఖ దానిని తిరస్కరించింది. దీని ఫలితంగా ఆదాయం తక్కువగా చూపించిందని పేర్కొంటూ రూ. 8.85 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా సంబంధిత పన్ను బాధ్యతలో 200 శాతం రేటుతో విధించబడింది.
ACC లిమిటెడ్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నదేమిటంటే.. ఈ రెండు జరిమానా ఉత్తర్వులను కంపెనీ అప్పీల్ చేస్తామని తెలిపింది. నిర్ణీత గడువులోపు ఆదాయపు పన్ను కమిషనర్ వద్ద అప్పీల్ ఫైల్ చేస్తామని.. అలాగే జరిమానా డిమాండ్లపై స్టే (stay) కోరుతామని తెలిపింది. ఈ జరిమానాలు తమ రోజువారీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపవని ACC స్పష్టం చేసింది.
ACC లిమిటెడ్ అనేది భారతదేశంలో ప్రముఖ సిమెంట్ కంపెనీ. ఇది అదానీ సిమెంట్స్‌కి అనుబంధ సంస్థ, కాగా అంబుజా సిమెంట్స్.. ACCలో 50 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్‌లో, అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్‌కి చెందిన హోల్సిమ్ గ్రూప్ నుండి అంబుజా సిమెంట్స్, ACC లిమిటెడ్‌ను 6.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 51,000 కోట్లు) విలువైన ఒప్పందంలో కొనుగోలు చేసింది.
ACC తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 21,762 కోట్లు.అలాగే సిమెంట్ అమ్మకాలు 39 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. భారతదేశంలోని నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ACC లాంటి సిమెంట్ దిగ్గజాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఈ జరిమానాలు ACC.. Adani Group లో విలీనం కానున్న కంటే ముందు కాలానికి సంబంధించినప్పటికీ, దేశంలోని పెద్ద పారిశ్రామిక సమూహం అయిన అదానీ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ చర్య పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో అదానీ గ్రూప్‌పై పలు నియంత్రణ సంస్థల దృష్టి ఉన్న నేపథ్యంలో ఈ తాజా జరిమానా వార్త మరోసారి చర్చల్లో నిలిచింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications