Adani News: గౌతమ్ అదానీ విపరీతమైన విస్తరణ కాంక్ష కంపెనీలపై అప్పుల భారాన్ని కొండలా పేర్చేస్తోంది. హిండెన్ బర్గ్ ఆరోపణలతో కొన్ని చిన్న, పెద్ద రుణాలను ముందుగానే చెల్లించగా.. గ్రూప్ డబ్బు అవసరాలను మరింతగా పెరుగుతున్నాయి.
అసలు విషయంలోకి వస్తే అదానీ గ్రూప్ దాదాపు 3.5 బిలియన్ డాలర్ల అప్పు కోసం ప్రయత్నిస్తోంది. మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.29 వేల కోట్లకు ఇది సమానమైన రుణం. అయితే ఇంత భారీ మెుత్తాన్ని అంబుజా సిమెంట్స్ రుణాల రీఫైనాన్సింగ్ కోసం కంపెనీకి అవసరమైనట్లు వెల్లడైంది. ఈ ఏడాది ఆసియాలో అతిపెద్ద సిండికేట్ రుణాల్లో ఒకటిగా ఇది నిలవనుంది. ఇందుకోసం రుణదాతలను మూడు వర్గాలుగా విభజించినట్లు తెలుస్తోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం DBS Group Holdings, First Abu Dhabi Bank, Mizuho Financial Group, Mitsubishi UFJ Financial Group and Sumitomo Mitsui Banking Corp ఒక్కొక్కటి 400 మిలియన్ డాలర్ల చొప్పున అదానీకి రుణాన్ని అందించనున్నాయని సమాచారం. అయితే మిగిలిన మెుత్తాన్ని బ్యాంకులు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షరతులు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది పూర్తైతే ఆసియాలో జపాన్ బయటం ఈ ఏడాది జరిగిన నాలుగో అతిపెద్ద రుణంగా నిలవనుంది.
అంబుజా సిమెంట్ అసలు ప్లాంట్‌పై అదానీ గ్రూప్ సుమారు 300 మిలియన్ డాలర్లను చెల్లించనుంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సుమారు 3.8 బిలియన్ డాలర్ల విలువైన రుణాలను రీఫైనాన్స్ చేయడానికి బ్యాంకులతో చాలా నెలలుగా చర్చలు జరుపుతోందని సమాచారం. అయితే ఈ వార్తపై అదానీ గ్రూప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ప్రస్తుతం ఉన్న రుణాలను తిరిగి చెల్లించి తక్కువ వడ్డీ లేదా ఖర్చులకు రుణాన్ని పొందటాన్ని రీఫైనాన్సింగ్ అని పిలుస్తారు.


Click it and Unblock the Notifications