Adani Debts: గత ఏడాది గౌతమ్ అదానీ తన వ్యాపారాలను విస్తరించటంలో వేగంగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబుజా సిమెంట్స్, ఏసీసీ కంపెనీలను సొంతం చేసుకున్నారు.
ఈ మెగా డీల్ కోసం భారీ మెుత్తంలో రుణాలను అదానీ గ్రూప్ తీసుకుంది. అయితే ప్రస్తుతం 3.8 బిలియన్ డాలర్లు లేదా రూ.30,100 కోట్ల అప్పు రీ-ఫైనాన్సింగ్ కోసం అంతర్జాతీయ బ్యాంకులతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ రుణం అంబుజా సిమెంట్స్ కొనుగోలుతో ముడిపడి ఉంది.
అంబుజా సిమెంట్స్, ఏసీసీలో హోల్‌సిమ్ గ్రూప్ మొత్తం వాటాను గతేడాది సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

బార్క్లేస్, డ్యూయిష్ బ్యాంక్ ఏజీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, Mitsubishi UFJ ఫైనాన్షియల్ గ్రూప్ వంటి బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ దాదాపు 3-4 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం ఇటు అదానీ గ్రూప్ కానీ అటు ఫైనాన్స్ సంస్థలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. జనవరిలో హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత తొలిసారిగా అదానీ గ్రూప్ డెట్ రీఫైనాన్సింగ్ కోసం వెళుతోంది. దీనికి ముందు గ్రూప్ అనేక రుణాలను గడువు కంటే ముందరే చెల్లించి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపింది.

ప్రస్తుతం అదానీ గ్రూప్ చేస్తున్న కొత్త ప్రయత్నం విజయవంతమైతే.. హిండెన్‌బర్గ్ షాక్ తర్వాత గ్రూప్ యథావిధిగా తిరిగి వ్యాపారంలోకి రావడానికి ఇది బలమైన సంకేతంగా నిలవనుంది. అయితే షాకింగ్ రిపోర్ట్ వల్ల అదానీ కంపెనీల విలువ ఏకంగా 150 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. అయితే ఇప్పుడు కేసును సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. అదే సమయంలో అదానీ గ్రూప్‌కు సంబంధించిన కేసు దర్యాప్తు నివేదికను కూడా ఆగస్టులో సెబీ సుప్రీంకోర్టుకు అందజేయనుంది.


Click it and Unblock the Notifications