Adani Cement: అదానీ కన్ను ఇటీవల దేశంలోని సిమెంట్ వ్యాపారంపై పడింది. ఈ క్రమంలోనే అవకాశం దొరికినప్పుడల్లా కొత్త కంపెనీలను అదానీ కొనేందుకు పోటీ పడుతున్నారు.
ఈ క్రమంలోనే అప్పుల ఊబిలో కూరుకుని సతమతమౌతున్న ABG షిప్‌యార్డ్ గ్రూప్‌కు చెందిన వాద్రాజ్ సిమెంట్‌ను కొనుగోలు చేసేందుకు అదానీ క్యూలో నిలిచారు. నివేదికల ప్రకారం అదానీ గ్రూప్ కంపెనీతో పాటుగా.. సజ్జన్ జిందాల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యు సిమెంట్, ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ కొనుగోలుకు బలమైన పోటీదారులుగా నిలిచాయి. కంపెనీని కొనుగోలు చేసేందుకు ఈ ముగ్గురు దిగ్గజాల మధ్య బిడ్డింగ్ వార్ జరిగే అవకాశం కనిపిస్తోంది.

దివాలా కోడ్ ప్రక్రియ కింద కంపెనీ విక్రయించబడుతోంది. 2018లో బాంబే హైకోర్టు బ్యూమర్ టెక్నాలజీ ఇండియా బకాయిలను క్లియర్ చేయడానికి వడరాజ్ సిమెంట్‌ను మూసివేయాలని ఆదేశించింది. కంపెనీ ఆస్తులను విక్రయించే ప్రక్రియతో కోర్టు నిరాశ చెందిందని కేసు గురించి తెలిసిన వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పుడు సిమెంట్ కంపెనీ రుణ పరిష్కార ప్రక్రియను ఐబీసీకి బదిలీ చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఒక బ్యాంకు పిటిషన్ ఆధారంగా హైకోర్టు సెప్టెంబర్ 4 నాటి తన ఉత్తర్వుల్లో ఎన్‌సీఎల్‌టీకి లిక్విడేషన్ ప్రక్రియను బదిలీ చేయడానికి ఆమోదించింది.
అయితే కొనుగోలుకు రేసులో ఉన్న కంపెనీలు ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కంపెనీని కొనుగోలు రేసులో ఉన్న సంస్థలు రూ.2,000 నుంచి రూ.2,500 కోట్లకు బిడ్డింగ్ చేయవచ్చని రుణదాతలు అంచనా వేస్తున్నారు. అయితే వాస్తవానికి కంపెనీకి మెుత్తం రూ.7,000 కోట్ల విలువైన రుణాలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, UCO బ్యాంక్, యెస్ బ్యాంక్ సిమెంట్ కంపెనీకి రుణాలను అందించిన జాబితాలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications