Jaypee Cement: మోదీ సర్కార్ దేశ నిర్మాణంపై దృష్టి పెడుతున్న వేళ అదానీ దానిని అందిపుచ్చుకునేందుకు కొన్ని రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో సిమెంట్ రంగంలోని కంపెనీల వరుస కొనుగోళ్లకు అదానీ గ్రూప్ దిగింది.
ఇప్పటికే అదానీ గ్రూప్ దేశంలోని ఏసీసీ, అంబుజూ సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేసి దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా నిలిచింది. దేశంలో సిమెంట్ రంగంలో మెుదటి స్థానంలో కొనసాగుతున్న బిర్లాలను అధిగమించాలని గౌతమ్ అదానీ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అదానీ కన్ను జేపీ గ్రూప్‌కు చెందిన సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల సిమెంట్ ఆస్తులను పొందేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం. జూన్ ప్రారంభంలో జేపీ సిమెంట్స్ దివాలా ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఐసీఐసీఐ బ్యాంక్ దరఖాస్తు దాఖలు చేసిన 6 ఏళ్ల తర్వాత.. జూన్ 3న, అలహాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టు జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్‌ను కార్పొరేట్ దివాలా తీయడానికి అంగీకరించింది. జైప్రకాష్‌పై దివాలా ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల కంపెనీ సిమెంట్‌ను, సున్నపురాయి గనులు, పవర్ ప్లాంట్ వంటి అనుబంధ ఆస్తులను కొనుగోలు చేసేందుకు అదానీకి అవకాశం లభించిందని తెలుస్తోంది. ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అదానీ గ్రూప్ ఇప్పటికే పని ప్రారంభించిందని సమాచారం. వాస్తవానికి ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రేసులో అల్ట్రాటెక్, అదానీ, దాల్మియా, JSW సిమెంట్ వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి.
2024లో జూన్ 27న అదానీతో పోటీలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ ఇండియా సిమెంట్స్‌లో 19.44 శాతం వాటాను ఒక్కో షేరుకు రూ.267 చొప్పున కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ మరో 3.4 శాతం వాటాను ఒక్కో షేరుకు రూ.285 చొప్పున కొనుగోలు చేస్తుంది. మొత్తం కొనుగోలు వ్యయం రూ.1,900 కోట్లకు పైనే ఉంటుంది.
అదానీ సిమెంట్ కొనుగోళ్లు:
గత నెల అంబుజా సిమెంట్స్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను రూ.10,422 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. దీనికి ముందు రెండేళ్ల కిందట అదానీ గ్రూప్ ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, సంఘీ ఇండస్ట్రీస్ వ్యాపారాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications