big deal: ఆనందోత్సాహాల్లో అదానీ గ్రూప్.. ఆసియాలోనే అతిపెద్ద డీల్ సొంతం
తాజాగా జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. ఈ గెలుపు ప్రభావం అదానీ కంపెనీలపై స్పష్టంగా కనిపించింది. భారీ లాభాలతో మంచి జోరుమీదున్న అదానీ గ్రూపు.. మరో అతిపెద్ద ఫైనాన్స్ డీల్ సొంతం చేసుకుంది.
పలు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి 1.36 బిలియన్ డాలర్ల మేర అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నిధులను సేకరించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దీన్ని ఆసియాలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఫైనాన్స్ డీల్స్‌లో ఒకటిగా పేర్కొంది. మొత్తం 3 బిలియన్ డాలర్ల ఫండ్స్ సమీకరణలో ఇదొక భారీ ఒప్పందంగా వెల్లడించింది.

బీఎన్పీ పరిబాస్, కోఆపరేటివ్ రాబోబ్యాంక్ UA, డీబీఎస్ బ్యాంక్ లిమిటెడ్, ఇంటెసా సాన్‌పావ్‌లో స్పా, MUFG బ్యాంక్ లిమిటెడ్, సొసైటీ జనరల్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్ప్ సహా 8 అంతర్జాతీయ బ్యాంకుల కన్సార్టియం ఈ భారీ గ్రీన్ లోన్ ను అందిస్తోంది. సెకండ్ పార్టీ ఒపీనియన్ ప్రొవైడర్ సస్టైనలిటిక్స్ ఈ ఫైనాన్సింగ్‌ను ధ్రువీకరించింది.
గుజరాత్‌లోని ఖవ్డాలో అభివృద్ధి చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉద్యానవనం కోసం ఈ ఫైనాన్సింగ్ కీలకమని కంపెనీ పేర్కొంది. ఈ నిధుల ద్వారా ప్రారంభ దశలో 2 వేల 167 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన యూనిట్స్ నెలకొల్పాలని భావిస్తోంది. ఈ భారీ సైట్ భవిష్యత్తు విస్తరణకు దీన్ని పునాదిగా చెబుతోంది.


Click it and Unblock the Notifications