Adani News: చైనాకు సవాల్ విసిరేందుకు సిద్ధంగా అదానీ కంపెనీ, ప్లాన్ ఇదే..!!
Adani Ports: గడచిన దశాబ్ధకాలంగా అదానీ గ్రూప్ దేశంలోని వివిధ కీలక రంగాల్లో వేగంగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియాకు కీలకమైన రంగాలు, దేశాల్లో సైతం గౌతమ్ అదానీ తన వ్యూహాత్మక పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.
గౌతమ్ అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ తన వ్యాపారాన్ని దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో అదానీ పోర్ట్స్ మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో మరిన్ని ఓడరేవులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అదానీ గ్రూప్ పోర్ట్స్ వ్యాపార విస్తరణ చర్య భారత్‌ను వ్యాపార కేంద్రంగా మార్చడంతో పాటు.. చైనా ఆధిపత్యానికి సవాలు విసురుతుంది.

పేలవమైన షిప్పింగ్ కనెక్టివిటీ కారణంగా భారతదేశ సముద్ర వాణిజ్యం సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న అవాకాశాలను అందిపుచ్చుకోవాలని సౌత్-మిడిల్ ఈస్ట్‌లలో అదానీ పోర్ట్స్ నిర్ణయించింది. అలాగే మార్కెట్ క్యాప్ పరంగా అదానీ పోర్ట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ ఆపరేటర్. కంటైనర్ ట్రాఫిక్ పరంగా ప్రపంచంలో చైనా తర్వాత రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో తూర్పు నుంచి పడమర వరకు మొత్తం సరఫరా గొలుసులో భారతదేశాన్ని కేంద్ర బిందువుగా మార్చడానికి తాము కృషి చేస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ స్పష్టం చేశారు.
అదానీ గ్రూప్ తన వృద్ధి ప్రణాళికలను వేగంగా పునరుద్ధరిస్తున్న సమయంలో ఈ కొనుగోలు డ్రైవ్ వచ్చింది. గత ఏడాది కాలంగా అదానీ పోర్ట్స్ తన వ్యాపారాన్ని నిరంతరం విస్తరిస్తోంది. డా నాంగ్‌లో గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధికి వియత్నామీస్ ప్రభుత్వం నుంచి అదానీ పోర్ట్స్ ఇప్పటికే "సూత్రప్రాయంగా ఆమోదం" పొందింది. దీని విలువ 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. దీనికి తోడు ఇజ్రాయెల్‌లోని హైఫా, శ్రీలంకలోని కొలంబో, టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ ఓడరేవులను కూడా అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications