Gautam Adani: భారతీయ వ్యాపార రంగంలో అదానీ చాలా వేగంగా దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన వ్యాపార విస్తరణను పోర్ట్స్, పవర్, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ పోర్ట్స్, పోర్ట్స్, నిర్మాణం, సిమెంట్ సహా అనేక రంగాల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఫస్ట్ మూడర్ అడ్వాంటేజ్ కంటే బలమైన ఎంట్రీకి అదానీ ఎప్పుడు ప్రాధాన్యతను అందిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ క్రమంలో ఆయన అనేక కంపెనీలను కొనుగోలు చేస్తూ మార్కెట్లో స్థానాన్ని భలోపేతం చేసుకుంటూ ముందుకు సాగిన సంగతి తెలిసిందే.
గౌతమ్ అదానీ గ్రూప్ వేగంగా వివిధ రంగాల్లోకి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీ డీల్ చేసుకునేందుకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం అదానీ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న డెవలపర్ ఎమ్మార్ గ్రూప్ భారతీయ యూనిట్‌ను 1.4 బిలియన్ డాలర్లకు సంస్థను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏప్రిల్ నాటికి ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
లావాదేవీ నిర్మాణం గురించి అదానీ గ్రూప్, ఎమ్మార్ మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలో అదానీకి చెందిన అన్‌లిస్టెడ్ ఎంటిటీ ద్వారా దాదాపు 400 మిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే చర్చలు కొనసాగుతున్నందున ఇది ఫైనల్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఒప్పందం జరుగుతుందనే నమ్మకం లేదని వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రెండు సంస్థలు ఇప్పటి వరకు అధికారికంగా ఇప్పటి వరకు స్పందించకపోవటంతో ఇన్వెస్టర్లలో కూడా ఈ వ్యవహారంలో గందరగోళం కొనసాగుతోంది.

వాస్తవానికి.. ఎమ్మార్ ఇండియా లిమిటెడ్‌లో వాటాను విక్రయించే అవకాశం గురించి అదానీతో సహా కొన్ని భారతీయ గ్రూపులతో చర్చలు జరుపుతున్నట్లు జనవరిలోనే ఈ దుబాయ్ కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎమ్మార్ యూనిట్ కొనుగోలు ఇండియాలో అదానీ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో విస్తరణకు పెద్ద అవకాశంగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మార్ ఇండియా దిల్లీ, పంజాబ్, యూపీ, ఎంపీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నివాస, వాణిజ్య ప్రాజెక్టులను అభివృద్ధిలో ఉంది.
ముంబైలోని అతిపెద్ద నివాస ప్రాజెక్టుల్లో ఒకదానిని తిరిగి అభివృద్ధి చేయడానికి అదానీ కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ యూనిట్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించిన సంగతి తెలిసిందే. ఆసియాలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావీని అదానీ గ్రూప్ ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. నవభారత్ మెగా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 80 శాతం వాటాను కలిగి ఉండగా.. మిగిలిన వాటాను మహారాష్ట్ర సర్కార్ హోల్డ్ చేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications