Telangana News: గతేడాది జనవరి నుంచి హిండెన్‌బర్గ్ నివేదిక వల్ల అదానీ గ్రూప్ ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే డబుల్ ఫాస్ట్‌తో తిరిగి పుంజుకోగలిగింది. ఇటీవల తమిళనాడులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంకాగా.. ప్రస్తుతం తెలంగాణపై గౌతమ్ అదానీ ఫోకస్ పెట్టారు. రక్షణ రంగంలో చరిత్ర సృష్టించడానికి సిద్ధమయ్యారు.
కొత్తగా ఎన్నికైన తెలంగాణ CM రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ.. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు వ్యాపారాలకు సంబంధించి 12 వేల 400 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు IT మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కూడిన తెలంగాణ మంత్రుల బృందం 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

1,350 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ 5 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. చందనవెల్లిలో 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ కోసం మరో 5 వేల కోట్లు, 6 MTPA సామర్థ్యంతో అంబుజా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్ కోసం 1,400 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు సమాచారం.
ఇక ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్‌లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మరియు మిస్సైల్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లలో వెయ్యి కోట్లు చేయనున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. క్షిపణులు మరియు మానవ రహిత వాహనాల తయారీకి హైదరాబాద్‌ను కొత్త కేంద్ర బిందువుగా చేయనున్నట్లు వెల్లడించింది. రాబోయే మూడేళ్లలో అదనంగా మరో 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది.
హైదరాబాద్‌లో సుదూర శ్రేణి క్షిపణులు, నౌకాదళ క్షిపణులు, తదుపరి తరం యాంటీ-రేడియేషన్ క్షిపణులు, రుద్రం-2 హైపర్‌సోనిక్ క్షిపణుల తయారీ చేపట్టనున్నట్లు గతంలోనే అదానీ గ్రూప్ ప్రకటించింది. ఏరోస్పేస్ పార్క్‌లో అదానీ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ దేశీయంగా తయారు చేసిన దృష్టి 10 స్టార్‌లైనర్ మానవరహిత ఏరియల్ వెహికల్‌ను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ గత వారం ఆవిష్కరించారు. నౌకాదళ కార్యకలాపాలలో దీన్ని చేర్చేందుకు పోర్‌బందర్‌కు పంపించనున్నట్లు స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications