Adani Group: భారతీయ బిలియనీర్ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వరుసగా ఎదురుదెబ్బలతో సతమతమౌతున్నారు. పవర్ నుంచి ఎయిర్ పోర్ట్స్ వరకు వివిధ విదేశీ వ్యాపారాలకు ఎదురవుతున్న తలనొప్పులు వ్యాపారంలో ముందుకు సాగుకుండా అడ్డుకుంటున్నాయి. హిండెన్‌బర్గ్ 2023లో ఆరోపణల తర్వాత అదానీకి కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి.
అదానీ గ్రూప్‌కి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అదానీ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకున్నట్లు శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక ఇంధన మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ దీనికి సంబంధించిన వార్తలు నేడు వెలువడ్డాయి. 2024 డిసెంబరులో గౌతమ్ అదానీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం నిర్ణయం తీసుకోబడింది.

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే నేతృత్వంలోని ప్రభుత్వం కంపెనీ స్థానిక ప్రాజెక్టులపై దర్యాప్తు ప్రారంభించిందని, దీని కారణంగా అదానీ ఒప్పందం రద్దు చేయబడినట్లు నివేదికలు చెబుతున్నాయి. మే 2024లో ద్వీపంలోని వాయువ్య ప్రాంతంలో ఇంకా నిర్మించని అదానీ పవన విద్యుత్ కేంద్రం నుంచి కిలోవాట్‌కు 0.0826 డాలర్ల చొప్పున విద్యుత్తును కొనుగోలు చేయడానికి మునుపటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసిందని, ప్రాజెక్టును రద్దు చేయలేదని సమాచారం.
మొత్తం అదానీ ప్రాజెక్టును సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది ద్వీప దేశం. అదానీ ప్రతిపాదన ఖర్చులో దాదాపు మూడింట రెండు వంతుల ధరకే చిన్న రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలు విద్యుత్తును అందిస్తున్న నేపథ్యంలో అదానీ డీల్‌పై వ్యతిరేకత వెల్లువెత్తింది. మన్నార్-పూనెరిన్ తీరప్రాంతాల్లో అదానీ 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కూడా పర్యావరణ సమస్యల కారణంగా సుప్రీంకోర్టులో సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీల్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
లంచం చెల్లింపులు చేసి ఈ లావాదేవీలను అమెరికా పెట్టుబడిదారుల నుండి దాచిపెట్టారనే ఆరోపణలతో అదానీపై నవంబర్ 19న అమెరికాలో అభియోగం మోపబడింది. అయితే ఇవి పూర్తిగా నిరాధారమైనవిగా అదానీ గ్రూప్ కొట్టిపడేసింది. అదానీ ప్రస్తుతం ఎనర్జీ ట్రాన్స్ మిషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, పవర్, బొగ్గు, ఎయిర్ పోర్ట్స్, సిమెంట్, పోర్ట్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా వంటి అనేక వ్యాపారాల్లోకి విస్తరించింది. శ్రీలంకలో 442 మిలియన్ డాలర్ల విద్యుత్ ప్రాజెక్టుకు అదానీ ఆమోదం 2023లో పొందగా ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటూ అడ్డంకులను కలిగిస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications