adani: హిండెన్ బర్గ్ నివేదిక విడుదల అనంతరం అదానీ గ్రూపు కంపెనీల్లో ఏర్పడిన సంక్షోభం అందరికీ తెలిసిందే. లక్షల కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. వివిధ డీల్స్ ను స్వయంగా వదులుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో ముంద్రాలో చేపట్టిన PVC ప్రాజెక్టు నుంచి సైతం అదానీ గ్రూపు తప్పుకుంటోందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కంపెనీ ప్రతినిధి వివరణ ఇచ్చారు.

నిలిపివేత తాత్కాలికమే:
ముంద్రా పెట్రోకెమికల్స్ లిమిటెడ్(MPL)కు సంబంధించిన గ్రీన్ PVC ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు అదానీ గ్రూపు తెలిపింది. ఫైనాన్షియల్ క్లోజర్ వల్ల సైట్ లో నిర్మాణ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. ఈ వ్యవహారం ఆర్థిక సంస్థల వద్ద పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన సమయానికే కంప్లీట్ చేయనున్నట్లు చెప్పింది.

మీడియాలో బేస్ లెస్ కథనాలు:
2021లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) వద్ద గ్రీన్ ఫీల్డ్ కోల్-టు-PVC ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) అనుబంధ సంస్థ ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్‌ను నెలకొల్పింది. అయితే గ్రూపుపై వచ్చిన ఆరోపణల వల్ల దాదాపు 35 వేల కోట్ల విలువైన పెట్రో కెమికల్ ప్రాజెక్టును ఆపేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

మరో 6 నెలల్లో పనులు ప్రారంభం:
ఇటీవల మార్కెట్ పరిణామాల ఆధారంగా ఇంజినీరింగ్ డిజైన్, ఫైనాన్షియల్ క్లోజర్ సహా ఇతర కార్యకలాపాలను సాద్యమైనంత త్వరగా కొనసాగించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు కంపెనీ ప్రతినిధి ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. మరో 6 నెలల్లో అక్కడ పనులు ప్రారంభం అవుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో మార్కెట్లో రూమర్లకు చెక్ పెట్టినట్లయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications