Gautam Adani: ధీరూబాయ్ అంబానీ అంటే వ్యాపార సామ్రాజ్యంలో తెలియని వారు ఉండరు. చిన్న పరిశ్రమను స్థాపించి దానిని ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సమూహంగా మార్చటంలో ఆయన పాత్ర నిజంగా అనిర్వచనీయం. ప్రస్తుతం దేశంలో ఉన్న చాలా మంది వ్యాపారవేత్తలకు ఆయన జీవితం ఆదర్శప్రాయం. ఆయన ఎదుగుతున్న సమయంలో మార్కెట్లో చాలా ఆటుపోట్లను చూశారు. అలా 1982లో ఆయన ఎదుర్కొన్న ఒక పరిస్థితి మళ్లీ ఇప్పుడు రిపీట్ అవ్వటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రిలయన్స్ ఐపీవో..
దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తొలిసారిగా 1977 అక్టోబరులో తన ఐపీవోను దేశీయ స్టాక్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్లో ఒక్కో షేరను రూ.10 ముఖ విలువతో మెుత్తం 28 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఆ తర్వాత కంపెనీ మూలధన అవసరాలకు కన్వర్టబుల్ డిబెంచర్ల మార్గాన్ని వినియోగించింది. ఆ తర్వాత బోనస్ షేర్లను ప్రకటించటం, రైట్స్ ఇష్యూల ద్వారా షేర్ల సంఖ్యను పెంచింది.

1982 బేర్ల దాడి..
ఐపీవోగా ప్రస్థానం ప్రారంభించిన రిలయన్స్ ధీరూబాయ్ నేతృత్వంలో క్రమంగా పెరుగుతూ 1980 షేర్ ధర రూ.104కి చేరుకుంది. ఆ తర్వాత 1982లో రూ.186 స్థాయిని తాకింది. ఆ సమయంలో కోల్‌కతాకు చెందిన బేర్ ఆపేటర్ల కార్టెల్ రిలయన్స్ షేర్లను షార్ట్ చేయటం ప్రారంభించింది. దీంతో రిలయన్స్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అలా బేర్స్ దాదాపుగా 3.5 లక్షల షేర్లను విక్రయించారు. దీంతో షేర్ ధర రూ.131 నుంచి రూ.121కి దిగజారింది. అలా స్వదేశీ షార్ట్ సెల్లర్స్ అంబానీ వ్యాపారాలను 1982లో టార్గెట్ చేశారు.

చోటుచేసుకున్న విచిత్రం..
బేర్స్ ఆపరేటర్లను దారికి తీసుకురావటానికి ఏకంగా ధీరూబాయ్ అంబానీ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు రిలయన్స్ గ్రూప్ కు అండగా నిలిచారు. బేర్స్ అమ్ముతున్నదాని కంటే ఎక్కువగా అంటే దాదాపు 8 లక్షల రిలయన్స్ షేర్లను వీరు కొనుగోలు చేశారు. ఇందుకోసం ఆరోజుల్లోనే రూ.10 కోట్లను వెచ్చించారు. అప్పట్లో 14 రోజుల ట్రేడింగ్ సెటిల్ మెంట్ వ్యవస్థ ఉండటం కూడా కొంత బేర్ ఆపరేటర్లకు కలిసొచ్చింది. కానీ వారి ప్రయత్నాలను అంబానీ గట్టిగా తిప్పికొట్టి కంపెనీని నిలబెట్టారు. ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపి వారి సంపదను కాపాడారు. దీని తర్వార షేర్ ధర రూ.201 స్థాయికి చేరుకుంది.

అదానీ పరిస్థితి..
ధీరూబాయ్ అంబానీ విషయంలో జరిగినట్లే ఇప్పుడు గౌతమ్ అదానీ విషయంలో జరుగుతోంది. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే.. ఈ సారి అంతర్జాతీయ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బెర్గ్ అదానీ గ్రూప్ కంపెనీల విషయంలో జరుగుతోంది. మార్కెట్ విశ్లేషకులు ప్రస్తుతం అప్పటి పరిస్థితులను ఇప్పుడు జరుగుతున్న వాటిలో లోప్చి చూస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అంబానీ మాదిరిగా పరిస్థితులను అదానీ అదుపులోకి తీసుకురాగలరా లేదా అన్నదే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications