Adani News: భవిష్యత్తు కోసం అదానీ బంగారు బాతు పెట్టుబడి.. మెగా సోలార్ ప్లాన్..
Adani Green: దేశంలో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ అత్యున్నత స్థాయిలకు చేరుకుంటోంది. ఈ క్రమంలో ఇండియన్ బిలియనీర్ గౌతమ్ అదానీ అతిపెద్ద ప్రణాళికను రచించారు.
ప్రస్తుతం అదానీ గ్రూప్ తన సోలార్ ఎనర్జీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 10 GW ఇంటిగ్రేటెడ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచాలని చూస్తోంది. అంటే 2027 నాటికి ప్రస్తుత కెపాసిటీని 2.5 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజా నివేదికల ద్వారా వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 4 గిగా వాట్లుగా ఉంది.

అదానీ గ్రూప్ ఈ మెగా ప్లాన్ విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఒక అడుగు ముందుకేశారు. అదానీ ఇటీవల బార్క్లేస్ PLC, డ్యుయిష్ బ్యాంక్స్ AG నుంచి సోలార్ తయారీ కోసం 394 మిలియన్ డాలర్లను ట్రేడ్ ఫైనాన్స్ సౌకర్యం ద్వారా సేకరించింది. ఇప్పటికే అదానీ సోలార్ ఎగుమతుల్లో 3,000 మెగావాట్లకు పైగా ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. వీటిని కంపెనీ రానున్న 15 నెలల్లో డెలివరీ చేయాల్సి ఉంది. దేశంలో బలహీనమైన తయారీ పర్యావరణ వ్యవస్థ కారణంగా ప్రక్రియ నెమ్మదిగా కొనసాగింది. అయితే దేశంలో సోలార్ సామర్థ్యం మార్చి 2014లో 2.63 GW నుంచి జూలై 2023 నాటికి 71.10 GWకు పెరిగింది.
ఈ పరిస్థితుల్లో కేంద్రం సోలార్ మాడ్యూల్ తయారీదారుల జాబితా (ALMM) మరియు ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (PLI) పథకం ద్వారా ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ చర్య అదానీ వంటి ప్రైవేట్ కంపెనీలను సోలార్ తయారీ రంగంలో తమ పెట్టుబడులను పెంచడానికి ప్రోత్సహించింది. అదానీ సోలార్ 1.2 GW సెల్ మరియు మాడ్యూల్ తయారీ సామర్థ్యంతో 2016లో దాని తయారీని ప్రారంభించింది. 6 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో.. కంపెనీ తన సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచింది.


Click it and Unblock the Notifications