Adani Group: దాదాపు 18 నెలలు గడిచినా ఇప్పటికీ అదానీ-హిండెన్‌బర్గ్ మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. గత ఏడాది జనవరిలో తొలి నివేదిక తర్వాత అమెరికా షార్ట్ సెల్లర్ తాజాగా మరో కీలక ఆరోపణలతో ముందుకొచ్చింది. ఇది భారతీయ స్టాక్ మార్కెట్లలో పెద్ద సునామీని సృష్టించటానికి దారితీస్తోంది.
ఈ క్రమంలో అమెరికా సంస్థ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తిప్పికొట్టింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు పూర్తిగా హానికరమైవని, తప్పుదోవ పట్టిస్తున్నవి, మానిప్యులేటివ్ అంటూ కొట్టిపారేసింది. వాస్తవానికి 2023 మార్చిలో గౌరవనీయమైన సుప్రీం కోర్ట్ క్షుణ్ణంగా పరిశోధించి, కొట్టివేసిన కొన్ని ఆరోపణలను హిండెన్‌బర్గ్ తిరిగి రీసైక్లింగ్ చేసిందంటూ అదానీ గ్రూప్ పేర్కొంది. తమ విదేశీ హోల్డింగ్ నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని అదానీ గ్రూప్ ప్రతినిధి నేడు ప్రకటించారు. అలాగే వివరాలను పబ్లిక్ డాక్యుమెంట్లలో క్రమం తప్పకుండా వెల్లడిస్తారని పేర్కొన్నారు.

2007 నుంచి 2008 వరకు అదానీ పవర్‌లో 3i ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు నామినీ డైరెక్టర్‌గా, ఆ తర్వాత 2017 వరకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్ అహుజాకు హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న సమస్యలు లేదా వ్యక్తులతో ప్రస్తుత వాణిజ్య సంబంధాలు లేవని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు.
హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలు..
ఆగస్టు 10న విడుదల చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌లో అదానీ మనీ సిఫనింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్న అస్పష్టమైన ఆఫ్‌షోర్ సంస్థల్లో సెబీ చైర్‌పర్సన్ మాదాబి పూరీ బుచ్, ఆమె భర్త వాటాలు కలిగి ఉన్నారని విజిల్‌బ్లోయర్ పత్రాలు వెల్లడించాయని ఆరోపించింది. వారు బెర్ముడా, మారిషస్‌లో ఉన్న ఈ నిధులను గౌతమ్ అదానీ అన్నయ్య వినోద్ అదానీ నియంత్రిస్తున్నారని, నిధులను తారుమారు చేయడానికి, అదానీ లిస్టెడ్ కంపెనీల్లో స్టాక్ ధరలను పెంచడానికి ఉపయోగించారని నివేదించింది.
ఈ ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్, ఆమె భర్త హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న నిధుల్లో తమకు సీక్రెట్ వాటాలు ఏమీ లేవని తేల్చిచెప్పారు. అలాగే పూర్తి పారదర్శకతను నిర్ధారించడానికి తగిన సమయంలో వివరణాత్మక ప్రకటనను విడుదల చేస్తామని వారు పేర్కొన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications