Adani Group: గుజరాత్‌లో కాపర్ ఫ్యాక్టరీ పెడుతున్న అదానీ.. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతోందంటే..
Adani Group: భారత వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ గుజరాత్ లో రాగి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్ ముంద్రాలో బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ రాగి కర్మాగారం వచ్చే ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. భారత్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన పరివర్తనలో ఇది సహాయపడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. విద్యుదీకరణ కోసం వైర్లు అవసరం కాబట్టి రాగిని 'మెటల్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్' అని పిలుస్తారు. వైర్లు సాధారణంగా రాగితో చేయబడతాయి.

ఎలక్ట్రిక్ వాహనాలు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోలార్ ఫోటోవోల్టాయిక్స్(PV), విండ్ ఎనర్జీ, బ్యాటరీలు వంటి శక్తి పరివర్తన కోసం ముఖ్యమైన సాంకేతికతలకు రాగి చాలు ముఖ్యమైనది. గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(AEL) అనుబంధ సంస్థ అయిన కచ్ కాపర్ లిమిటెడ్(KCL), రెండు దశల్లో సంవత్సరానికి ఒక మిలియన్ టన్నుల శుద్ధి చేసిన రాగిని ఉత్పత్తి చేయడానికి ఒక కాపర్ రిఫైనరీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూప్ ఏకంగా 11 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది.
ఫేజ్-1లో ఏడాదికి ఐదు లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కోసం KCL ఫైనాన్సింగ్ పొందినట్లు అంతర్గత వర్గాల ద్వారా వెల్లడైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొదటి దశ అమలులోకి వస్తుందని సమాచారం. కొన్ని రోజుల క్రితం అదానీ కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో కూడా ప్రాజెక్ట్ తన షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతున్నట్లు వెల్లడైంది. తమిళనాడులో కాపర్ ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత దేశంలో రాగి ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా లేదని తెలుస్తోంది. రానున్న కాలంలో అదానీకి ఇది పెద్ద వ్యాపార అవకాశంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications