Adani Group: ఎన్నికల ఫలితాలకు ఒక్కరోజు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల ఉప్పెన కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కేంద్రంలో తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భారీ విజయాన్ని అందుకుంటుందని సూచిస్తున్నాయి. ఈ వార్తలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ అమాంతంగా పెరిగిపోతోంది. అలాగే ఆసియాలో రెండవ సంపన్నుది స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ అంబానీని సైతం వెనక్కి నెట్టారు.
ఈ క్రమంలో నేడు అదానీ గ్రూప్‌లోని 5 కంపెనీల షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలోనే అదానీ గ్రూప్ కంపెనీల విలువ ఏకంగా రూ.2.6 లక్షల కోట్లు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లలో కోలాహలం కొనసాగుతోంది.

1- అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల ధరలు ఈరోజు 9.72 శాతం పెరిగాయి. బీఎస్‌ఈలో కంపెనీ కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. మార్కెట్ ప్రారంభమైన తర్వాత షేర్లు 7 శాతానికి పైగా లాభపడి రూ.3743 మార్కును అందుకున్నాయి. సాయంత్రం 3.02 గంటల సమయంలో ఒక్కో షేరు ధర రూ.3640 స్థాయిలవద్ద కొనసాగుతున్నాయి.
2- అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ధర 9 శాతానికి పైగా లాభపడి సరికొత్త గరిష్ఠాలను తాకింది. ఇంట్రాడేలో స్టాక్ గరిష్ఠంగా రూ.1607.95కి తాకగా.. సాయంత్రం 3 గంటల సమయంలో షేర్ ధర బీఎస్ఈలో 9.90 శాతం లాభపడి రూ.1580 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
3- ఇదే క్రమంలో అదానీ పవర్ షేర్లు అత్యధికంగా 15 శాతం పెరుగుదలను ఇంట్రాడేలో నమోదు చేసింది. దీంతో షేర్లు సరికొత్త జీవితకాల గరిష్ఠమైన రూ.896.75 స్థాయిలకు చేరుకున్నాయి. సాయంత్రం 3 గంటల సమయంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఒక్కోటి 15.38 శాతం లాభంతో రూ.873.80 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
4- అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు నేడు ఇంట్రాడేలో గరిష్ఠంగా 11 శాతానికి పైగా పెరిగాయి. ఈ క్రమంలో స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర రూ.1250ని అందుకుంది. సాయంత్రం 3.10 గంటల సమయంలో 9 శాతానికి పైగా లాభంతో షేర్ ధర రూ.1224 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
5- ఇక అదానీ టోటల్ గ్యాస్ స్థాక్ ఇంట్రాడేలో 15 శాతానికి పైగా పెరిగి గరిష్ఠంగా
1,197.95 రూపాయలకు చేరుకుంది. అయితే తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు సాయంత్రం 3.10 గంటల సమయంలో 7.71 శాతం లాభంతో రూ.1119.25 వద్ద బీఎస్ఈలో కొనసాగుతోంది.
6- అదానీ విల్మార్ లిమిటెడ్ స్టాక్ సైతం నేడు ఇంట్రాడేలో దాదాపు 6 శాతం పెరిగింది. ఈక్రమంలో షేర్ ధర గరిష్ఠంగా రూ.382 స్థాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.47,880.16 కోట్ల మార్కును అందుకుంది. ఇన్వెస్టర్లు స్వల్పంగా అమ్మకాలకు దిగటంతో 3.51 వృద్దితో రూ.368.10 వద్ద షేర్లు ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
7- అదానీకి చెందిన మీడియా వ్యాపారం ఎన్డీటీవీ షేర్లు సైతం నేడు 10 శాతం మేర లాభపడ్డాయి. ఈక్రమంలో ఇంట్రాడేలో బీఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.274.90 స్థాయిని అందుకున్నాయి. అయితే స్వల్ప అమ్మకాలతో సాయంత్రం 3.17 గంటల సమయంలో కంపెనీ షేర్ ధర బీఎస్ఈలో ఒక్కోటి 6.25 శాతం లాభంతో రూ.263.50 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
8- అదానీ సిమెంట్ వ్యాపారంలోని కంపెనీ ఏసీసీ లిమిటెడ్ షేర్లు 6 శాతానికి పైగా ఇంట్రాడేలో పెరిగాయి. ఈ క్రమంలో కంపెనీ ఇంట్రా-డే గరిష్టం రూ.2717.40 ధరను అందుకున్నాయి. సాయంత్రం 3.19 గంటల సమయంలో షేర్ ధర 4.89 శాతం పెరిగి రూ.2670.75 వద్ద కొనసాగుతోంది.
9- అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ ధర 6 శాతానికి పైగా లాభపడింది. బీఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.665.05 రేటు వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.676.65 మార్కును అందుకున్నాయి. ఇది కంపెనీ సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర కావటం విశేషం. సాయంత్రం మార్కెట్ల ముగింపుకు ముందర కంపెనీ షేర్ ధర 5.85 శాతం వృద్ధితో రూ.671.95 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
10- చివరిగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో 13 శాతం పెరిగాయి. కంపెనీ షేర్లు రూ.2100 స్థాయిలో ప్రారంభమై.. కొంత సమయం తర్వాత 13.49 శాతం పెరిగి రూ.2173.65 స్థాయికి చేరుకున్నాయి. ఇది బీఎస్ఈలో 52 వారాల గరిష్ట ధర కావటం గమనార్హం. సాయంత్రం మార్కెట్ల ముగింపుకు ముందర కంపెనీ షేర్ ధర రూ.2042.60 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications