Solar Energy: పండుగ సమయంలో అదానీ గ్రూప్ మరో పెద్ద ఆర్డర్ సొంతం చేసుకుంది. అయితే ఈ సారి ప్రభుత్వం నుంచి కావటం విశేషం. దీంతో అదానీకి చెందిన ఒక కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
వివరాల్లోకి వెళితే అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SECU) నుంచి పెద్ద ఆర్డర్‌ను అందుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ సమాచారాన్ని స్టాక్ మార్కెట్‌కు వెల్లడించటంతో స్టాక్ మార్కెట్లలో కోలాహలం నెలకొంది. అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జనవరి 11,2024న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్(LOA) అందుకుంది. గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ స్కీమ్ (ట్రాంచ్-I) కింద దేశంలో ఎలక్ట్రోలైజర్‌ల తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ ఆర్డర్ వచ్చింది.

దేశంలో సంవత్సరానికి 198.5 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి అదానీ న్యూ ఇండస్ట్రీస్‌కు అప్పగించబడినట్లు ఆర్డర్ నిబంధనల ప్రకారం వెల్లడైంది. ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రోలైజర్ తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కిందకు వస్తుంది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ధర రూ.3,104.25 వద్ద స్వల్ప లాభంతో బీఎస్ఈలో ముగిసింది. దీనికి ముందు జనవరి 16, 2023న స్టాక్ తన 52 వారాల గరిష్ఠమైన రూ.3,739ని చేరుకుంది.
గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ కంపెనీలు పొందిన షాక్ తర్వాత ప్రస్తుతం గ్రూప్ కంపెనీలు తిరిగి రికవరీ ట్రాక్‌లో కొనసాగుతున్నాయి. గ్రూప్‌లో అగ్రగామి సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లలో కూడా అదే పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం ఆర్డర్ అందించిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. ఇది సోలార్ విండ్ రెన్యూవబుల్ ఆధారితి నిల్వ వ్యవస్థలు, విద్యుత్ వ్యాపారం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి RE- ఆధారిత ఉత్పత్తుల ప్రచారం, అభివృద్ధిలో నిమగ్నమై ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications