For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani Group: ఆందోళనలో అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లు.. కల్లోలానికి కారణం ఏమిటంటే..?

|

Adani Group: ఒక్కరోజులు ఓడలు బండ్లు అవుతాయనే సామెత మనందరం వినే ఉంటాం. అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి కూడా చూడబోతే అలాగే కనిపిస్తోంది. అవును నిన్న ఒక్కరోజే అదానీ కంపెనీలు ఏకంగా వేల కోట్ల ఇన్వెస్టర్ల ధనాన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేశాయి. ఈరోజు కూడా మార్కెట్లు కొంత డౌన్ ట్రెండ్ లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ షేర్లు సైతం భారీగా క్షీణించాయి.

వేల కోట్లు ఆవిరి..

వేల కోట్లు ఆవిరి..

భారత స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్కింగ్ వైపు మెుగ్గుచూపుతున్నారు. దీంతో కంపెనీ షేర్లు భారీగా నష్టాలను చవిచూడవలసి వచ్చింది. ఈ క్రమంలో గ్రూప్ లోని మెుత్తం 10 కంపెనీల విలువ ఏకంగా రూ.66,500 కోట్ల మేర తగ్గింది. కంపెనీల వ్యాల్యూయేషన్లో ఇంత భారీ పతనం అది కూడా ఒక్కరోజులోనే జరగటం ఇన్వెస్టర్లకు నిద్రలేకుండా చేస్తోంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్..

అదానీ ఎంటర్‌ప్రైజెస్..

గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు దారుణమైన పతనాన్ని చూశాయి. నిన్న గరిష్ఠంగా షేర్ 8 శాతం వరకు క్షీణించి రూ.27,800 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఈరోజు మధ్యాహ్నం 12.52 గంటల సమయానికి స్టాక్ రూ.28.75 క్షీణించి రూ.3,618.15 వద్ద ట్రేడ్ అవుతోంది.

అదానీ టోటల్ గ్యాస్..

అదానీ టోటల్ గ్యాస్..

అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర సైతం నిన్న 4% వరకు క్షీణించి రూ.3490.70కి చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో స్టాక్ రూ.46.20 మేర క్షీణించి రూ.3,610.20 వద్ద కొనసాగుతోంది. నిన్న మధ్యాహ్నం సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11,300 కోట్లు తగ్గింది. అలాగే అదానీ పోర్ట్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ నిన్న దాదాపుగా ఈ సమయానికి రూ.6,000 కోట్ల మేర క్షీణించింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ &అదానీ ట్రాన్స్‌మిషన్..

అదానీ గ్రీన్ ఎనర్జీ &అదానీ ట్రాన్స్‌మిషన్..

అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్ అండ్ అదానీ పవర్ మార్కెట్ క్యాప్ నిన్న వరుసగా రూ.5,000 కోట్ల మేర ఆవిరైపోయింది. ఈరోజు మధ్యాహ్నం అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ రూ.17.40 క్షీణించి రూ.1,877.80 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే అదానీ ట్రాన్స్ మిషన్ స్టాక్ ధర రూ.64.15 మేర తగ్గి రూ.2,587.85 వద్ద ఉంది. ఇదే సమయంలో అదానీ పవర్ కంపెనీ షేర్ ధర రూ.275.75 స్థాయి వద్ద ఇంట్రాడేలో ట్రేడవుతోంది.

అదానీ విల్మర్..

అదానీ విల్మర్..

ఐపీవోగా వచ్చిన అదానీ విల్మార్ స్టాక్ సైతం మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా నిన్న 4 శాతం మేర క్షీణించింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.25,000 కోట్ల మేర తరిగిపోయింది. ఈ క్రమంలో కంపెనీ స్టాక్ ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఏకంగా 2 శాతానికి పైగా లాభపడి రూ.583 వద్ద ట్రేడవుతోంది. గ్రూప్ కంపెనీలో విల్మర్ ఒక్కటి మాత్రమే లాభంలో కొనసాగటం విశేషం.

ఇతర కంపెనీలు..

ఇతర కంపెనీలు..

అదానీ గ్రూప్ ఇటీవల కొనుగోలు చేసిన వివిధ కంపెనీల షేర్లు సైతం నిన్న నష్టాల్లోనే కొనసాగాయి. ఈ క్రమంలో అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్, NDTV కంపెనీ షేరు సైతం పతనాన్ని నమోదు చేశాయి.

English summary

Adani Group: ఆందోళనలో అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లు.. కల్లోలానికి కారణం ఏమిటంటే..? | Adani group companies lost market cap heavily amid market down trend know details

Adani group companies lost market cap heavily amid market down trend know details
Story first published: Wednesday, January 11, 2023, 13:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X