Adani: బొగ్గు సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న అదానీ.. ఆ కంపెనీలకు లాభాల పంట.. ఎందుకంటే..
Coal Crisis: బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన కంపెనీ ఈ మధ్య బొగ్గు సరఫరా టెండర్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ సంస్థ ఎన్‌టీపీసీకి దిగుమతి చేసుకున్న బొగ్గును సరఫరా చేయడానికి పెద్ద కాంట్రాక్ట్ ను పొందింది. NTPC దిగుమతి చేసుకున్న 20 మిలియన్ టన్నుల బొగ్గు కోసం ఆర్డర్ చేసిందని తెలుస్తోంది.

అదానీకి లాభం ఇలా..
20 మిలియన్ టన్నుల్లో దాదాపు 17.3 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతికి ఆర్డర్ అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు అందింది. ఈ సంవత్సరం NTPC తన ప్లాంట్‌లో ఇప్పటికే 7 మిలియన్ టన్నుల విదేశీ బొగ్గును పొందింది. ఈ సమాచారాన్ని బ్లూమ్‌బెర్గ్ తన వార్తా కథనంలో వెల్లడించింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ స్టాక్ సోమవారం నాడు 2% కంటే ఎక్కువగానే లాభపడింది.

విద్యుత్ డిమాండ్ పెరగటంతో..
బొగ్గు సంక్షోభం వల్ల అతిపెద్ద ప్రయోజనం ఆసియాలోని సంపన్నుడైన గౌతమ్ అదానీకి మంచి రాబడిని అందిస్తోందని బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. వాస్తవానికి.. మండుతున్న వేడి సమయంలో బొగ్గుకు డిమాండ్, కరోనా తర్వాత పారిశ్రామిక కార్యకలాపాలు తిరిగి పునరుద్ధరణ కావటం వల్ల దేశంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. దీంతో.. బొగ్గుకు డిమాండ్ పెరిగింది. కానీ సరఫరా మాత్రం తగ్గింది. పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత ఏర్పడుతున్నందున.. ప్రభుత్వం త్వరగా స్థానిక బొగ్గు సరఫరాను పెంచాలని ఆదేశించింది. బొగ్గును దిగుమతి చేసుకోవలసిందిగా పెద్ద కంపెనీలకు సూచించింది. ఇది అదానీ గ్రూప్ నకు బాగా కలిసొచ్చింది.

అదానీ పోర్ట్స్ కు లాభాలు..
దిగుమతుల పెరుగుదల వల్ల అదానీ పోర్ట్ కంపెనీ లాభపడుతోందని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు డెన్నిస్ వాంగ్ సోమవారం ఒక నోట్‌లో రాశారు. దీనితో.. జూన్ త్రైమాసికంలో కంపెనీ మెరుగైన ఆదాయాన్ని నివేదించవచ్చని తెలుస్తోంది. డిమాండ్‌ను తీర్చేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. స్థిర ఒప్పందాలు, బలమైన రవాణా నెట్‌వర్క్ ద్వారా కంపెనీ ప్రయోజనం పొందుతోంది.


Click it and Unblock the Notifications