adani: హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూపు అతలాకుతలం అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇన్వెస్టర్లలో ధైర్యం నింపేందుకు సంస్థ అధినేత గౌతమ్ అదానీ స్వయంగా రంగంలోకి దిగారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు కలెక్ట్ చేసి అప్పులు తీర్చడంలో బిజీగా గడుపుతున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఓ రకంగా కంపెనీ ఘాటు సమాధానం చెప్పినట్లయింది.
రుణ భారం తగ్గించుకునేందుకు గ్రూపు కంపెనీల్లో 2.87 బిలియన్ డాలర్ల విలువైన వాటాలు విక్రయించినట్లు అదానీ గ్రూపు ప్రకటించింది. దీనితో 2.55 బిలియన్ డాలర్లను షెల్ కంపెనీల తిరిగి ద్వారా వ్యాపారంలోకి జొప్పించారన్న వార్తలను తిప్పికొట్టినట్లయింది. అదానీ షెల్ కంపెనీల్లోకి 20 వేల కోట్ల నిధులు ఎలా వచ్చాయని గతంలో రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఇప్పుడు అదానీ గ్రూపు డేటా వెలువడింది.

అబుదాబికి చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ, ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ PJSC (IHC) వంటి పెట్టుబడిదారులు అదానీ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ మరియు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) వంటి గ్రూప్ సంస్థలలో 2.593 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. అయితే అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్‌లో ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించడం ద్వారా 2.783 బిలియన్లను సమీకరించారు. ఈ మొత్తాన్ని కొత్త వ్యాపార అవకాశాల వృద్ధికి , ఇతర గ్రూపు కంపెనీల్లో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది.
పునరుత్పాదక ఇంధన సంస్థ AGELలో 20 శాతం వాటాను ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్‌కు విక్రయించారు. తద్వారా జనవరి 2021లో ప్రమోటర్లు 2 బిలియన్ల డాలర్లు సేకరించారని అదానీ కంపెనీలు పేర్కొన్నాయి. అయితే అంతకు ముందే అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్‌లో 37.4 శాతం వాటాను, అదే ఫ్రెంచ్ సంస్థకు 783 మిలియన్లకు విక్రయించినట్లు తెలిపారు. సెక్యూరిటీల చట్టానికి కట్టుబడి ప్రమోటర్ యాజమాన్యాన్ని సరిచూస్తున్నట్లుగా విల్లడించారు.


Click it and Unblock the Notifications