Adani News: ఆ లాజిక్ తో ముందుకెళ్తున్న అదానీ గ్రూప్.. జుగేషీందర్ సింగ్ మాస్టర్ ప్లాన్..!
Adani News: ఒక చిన్న లాజిక్ తో అదానీ గ్రూప్ అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ పై ఎదురుదాడికి దిగింది. అదానీ గ్రూప్ సీఈవో జుగేషీందర్ సింగ్ ఈ వ్యవహారంలో ఇన్వెస్టర్లకు, మార్కెట్ వర్గాలకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.

సీఎఫ్ఓ ఏమన్నారంటే..
అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ సరైన పరిశోధన చేయలేదని అదానీ గ్రూప్ సీఎఫ్ఓ వెల్లడించారు. కంపెనీ బహిర్గతం చేసిన విషయాలనే 'కాపీ-పేస్ట్' చేసిందని ఆరోపించారు. సరైన పరిశోధన చేయకుండా ప్రజలను తప్పుదోవపట్టించారని పేర్కొన్నారు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.

ప్రశ్నలకు సమాధానం..
శనివారం నాడు పెట్టుబడిదారులకు విడుదల చేసిన 413 పేజీల నివేదిక తర్వాత ఇంటర్వ్యూలో అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అడిగిన మొత్తం 88 ప్రశ్నలకు సమాధానమిచ్చిందని సింగ్ ఇంటర్వ్యూలో తెలిపారు. కంపెనీ అందించిన వివరాలనే కాపీ పేస్ట్ చేశారని ఇందులో పరిశోధన ఏముందని వెల్లడించారు. మెుత్తం ప్రశ్నల్లో 88 వాటికి జవాబులు ఇవ్వగా.. 68 బోగస్ ప్రశ్నలు ఉన్నాయని సీఎఫ్ఓ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన తెలిపారు. 68 ప్రశ్నలను హిండెన్ బర్గ్ ఎందుకు తప్పుగా వివరించారో చెప్పాలని సింగ్ అన్నారు.

మిగిలిన 20 ప్రశ్నలు..
మిగిలిన ప్రశ్నలకు సమాధానం గురించి అడగగా తాము అబద్దాలు అంగీకరించమని అన్నారు. వ్యక్తిగత కుటుంబ కార్యాలయం గురించి అడిగిన ప్రశ్నలకు తాము బదులివ్వలేమన్నారు. మెుత్తానికి అమెరికా సంస్థ విడుదల చేసింది ఒక బూటకపు నివేదిక అని సింగ్ స్పష్టం చేశారు. అయితే షార్ట్ సెల్లింగ్ సంస్థ అదానీ గ్రూప్ వ్యాపారాల్లో తప్పుగా సూచించడానికి ఏమీ కనుగొనలేకపోయిందని CFO చెప్పారు.

అదానీకి మద్ధతు..
కేవలం 4 భాగస్వాములు, 11 మంది ఉద్యోగులు కలిగి ఉన్న కంపెనీ అదానీ గ్రూప్ లాంటి పెద్ద సమ్మేళనాన్ని సమర్థవంతంగా ఎలా ఆడిట్ చేయగలదని షా ధంధారియా అనే ఆడిట్ సంస్థ ప్రశ్నించింది. డెలాయిట్, KPMG, ఎర్నెస్ట్ & యంగ్, PwC వంటి పెద్ద అకౌంటింగ్ సంస్థలను ఎందుకు అదానీ గ్రూప్ ఎందుకు వినియోగించుకోవటం లేదని సింగ్ ను ప్రశ్నించగా.. కంపెనీ చిన్న వెండార్లను ప్రోత్సహిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా గ్రూప్ మెుత్తం 21,000 మంది చిన్న వ్యాపారులను వినియోగిస్తోందని.. ఇది చెడ్డ విషయమా అని అన్నారు.


Click it and Unblock the Notifications