Adani News: 25 ఎకరాల భూమి కొన్న అదానీ గ్రూప్.. అక్కడే ఎందుకో తెలుసా..??

Adani Group: దేశంలో సంపన్న వ్యాపారుల్లో ఒకరిగా కొనసాగుతున్న గౌతమ్ అదానీ తన వ్యాపార కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నారు. ప్లాన్ ప్రకారం వివిధ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొత్త కొనుగోళ్లను చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ పూణెలోని వాఘేరే ప్రాంతంలో ఫినోలక్స్ ఇండస్ట్రీస్‌ కంపెనీకి చెందిన 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీనికోసం ఏకంగా రూ.470 కోట్లను అదానీ వెచ్చించారు. వాస్తవానికి అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ, రియల్ ఎస్టేట్ డెవలపర్ టెర్రా విస్టా కోసం గౌతమ్ అదానీ దీనిని కొన్నట్లు వెల్లడైంది. ఫినోలక్స్ నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న టెర్రా విస్టా అక్కడ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పింబ్రి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫినోలక్స్ సైట్‌ను టెర్రా విస్టా కొనుగోలు చేయడం కోసం ఏప్రిల్ 23న సేల్ డీడ్ రిజిస్టర్ చేయబడింది. వాస్తవానికి ఈ స్థలాన్ని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పీవీసీ పైపుల తయారీ కంపెనీకి లీజుకు ఇచ్చింది.

Adani Group Buys 25 acres of land for data center business at pune from finolex industries

దీనికి ముందు గతంలోనే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అమెరికాకు చెందిన గ్లోబల్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రొవైడర్ ఎడ్జ్ కన్నెక్స్ జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించాయి. రెండు సంస్థలు సంయుక్తంగా దేశంలో సెంటర్లను నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి 2021 ఫిబ్రవరిలో అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో డేటా సెంటర్‌లను నిర్మించడానికి, నిర్వహించడానికి ఎడ్జ్ కనెక్ట్‌తో 50:50 భాగస్వామ్యంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల అభివృద్ధిని అదానీ కొనసాగిస్తున్నారు.

అదానీ గ్రూప్ చెన్నై, ముంబై, నోయిడా, విశాఖ, హైదరాబాద్ మార్కెట్‌లతో ప్రారంభించి దేశవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను నిర్మించడంపై దృష్టి సారిస్తోంది. ఇవి డేటా సెంటర్లకు దేశంలో ఉన్న అధిక డిమాండ్‌ను తీర్చగలవని తెలుస్తోంది. ఈ ఎడ్జ్‌సైట్‌లు అవసరమైనంత సులభంగా స్కేల్ చేయడానికి, పూర్తి స్థాయి డేటా సెంటర్ క్యాంపస్‌లుగా రూపొందించడానికి రూపొందించబడ్డాయి.

అదానీ గ్రూప్ ఫినోలక్స్ నుంచి కొన్న స్థలం మొత్తం వైశాల్యం 25.27 ఎకరాలుగా ఉండగా.. దీనికి స్టాంపు డ్యూటీగా రూ.23.52 కోట్లును చెల్లించారు. దీనికి ముందు 2022లో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ పూణెలో ఫినోలక్స్ ఇండస్ట్రీస్ నుంచి రూ.328.84 కోట్లకు వాణిజ్య ప్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ కమర్షియల్ ఫ్లాట్ పూణేలోని పింప్రి వాగరే ప్రాంతంలో ఉండగా.. లీజు బదిలీ కోసం ఫినోలక్స్ రూ.328.84 కోట్లు పొందిన సంగతి తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+