Adani News: హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌కు రేపటితో ఏడాది.. ఈ గ్యాప్‌లో అదానీ గ్రూప్ ఏం సాధించిందంటే..
Hindenburg Report: అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ రిలీజ్ చేసిన నివేదిక భారత స్టాక్ మార్కెట్లలో తీవ్ర భయాందోళనలకు దారితీసింది. ఈ సెగ కాస్తా పార్లమెంటులోనూ కలకలం రేపింది. ఇది జరిగి సరిగ్గా రేపటికి ఏడాది పూర్తి కానుంది. ఈ కాలంలో అదానీ గ్రూప్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య తన ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగించింది.
US ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ మీద ఆరోపణలు చేసిన సరిగ్గా ఏడాది తర్వాత.. ఆయా కంపెనీల వ్యాపార ఫండమెంటల్స్ మరింత బలంగా మారినట్లు తెలుస్తోంది. పెద్దమొత్తంలో రుణాలను తగ్గించుకోవడంతో పాటు వ్యవస్థాపకుల ప్లెడ్జ్ వాటాలను తగ్గించుకుంది. అమెరికా సహా మిడిల్ ఈస్ట్ నుంచి పెద్ద సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షించగలిగింది.

వీటితో పాటు పలు ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌లను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. పెట్టుబడిదారులు మరియు రుణదాతలతో తరచుగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభించింది. అంతేకాకుండా ముంబైలో కొత్త విమానాశ్రయాన్ని కూడా నిర్మిస్తోంది. నగరంలోని విశాలమైన ధారవి మురికివాడను తిరిగి అభివృద్ధి చేస్తోంది.
గత సంవత్సరం కనిష్ట స్థాయికి పడిపోయిన అదానీ కంపెనీల స్టాక్‌లు 90 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. అయితే హిండెన్‌బర్గ్ రిపోర్ట్ విడుదలక పూర్వం వాటి విలువ కేవలం 60 బిలియన్ డాలర్లే కావడం గమనార్హం. గౌతమ్ అదానీ సామ్రాజ్యం మరింత పుంజుకుంటుందని ఇన్వెస్టర్లు నమ్మకంతో ఉన్నారు.
10 లిస్టెడ్ అదానీ కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు 175 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే షార్ట్ సెల్లర్ నివేదిక తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో రికార్డు కనిష్ట స్థాయి 82 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అప్పటి నుంచి సుమారు 112 శాతం వృద్ధి నమోదు చేసింది.


Click it and Unblock the Notifications