మంగళవారం అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరిగాయి. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ స్టాక్‌లg బూమ్‌తో ట్రేడవుతున్నాయి. జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ చాలా నష్టపోయింది. నివేదిక వచ్చిన తర్వాత, గ్రూప్‌లోని కొన్ని షేర్లు 80 శాతం వరకు పడిపోయాయి. ఈ స్టాక్‌లలో తరువాత రికవరీ కనిపించినప్పటికీ పూర్తి స్థాయిలో రికవరీ కాలేదు. ఇటీవల అదానీ గ్రూప్ గుజరాత్‌లో రూ.34,900 కోట్ల విలువైన పెట్రో కెమికల్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాల్సి వచ్చింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ 0.71%, అదానీ గ్రీన్ 5.0%, అదానీ పోర్ట్స్ 0.19 శాతం, అదానీ పవర్ 1.6%, అదానీ ట్రాన్స్‌మిషన్ 0.6%, అదానీ విల్మార్ 0.3%, అదానీ టోటల్ గ్యాస్ 0.7%, acc సిమెంట్ 1.27%, అంబుజా సిమెంట్ 1.22%, ndtv 1.03 శాతం పెరిగింది. అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై విచారణ చేసేందుకు సుప్రీం కోర్టు ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై విచారణ చేపట్టింది.

అదానీ గ్రీన్ స్టాక్ మంగళవారం అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. ఈ స్టాక్ జనవరిలో 60 శాతం పడిపోయింది. జనవరి 10న ఈ స్టాక్ రూ. 2,176 ఉంది. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత రూ.462 లకు పడియింది. ఈ స్టాక్ లో ఇప్పుడు రికవరీ కనిపిస్తోంది. ఈ స్టాక్ ప్రస్తుతం రూ.891 కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications