Adani Share: తారాజువ్వలా మారిన అదానీ కంపెనీ స్టాక్.. విదేశీ కంపెనీ పందెం వేయటంతో..
Adani Share: హిండెన్‌బర్గ్ సుడిగుండం నుంచి బయటపడిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీలు మళ్లీ తుఫాను వేగంతో పుంజుకుంటున్నాయి. దీనికి తోడు మళ్లీ విదేశీ పెట్టుబడిదారులు ఇస్తున్న ఊతంతో ముందుకు సాగుతున్నాయి.
అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు నేడు మార్కెట్లో అద్భుతమైన వృద్ధిని సాధించాయి. ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 4.59% పెరిగి రూ.1,010.20కి చేరుకున్నాయి. ఖతార్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ తాజాగా అదానీ గ్రీన్ లో బ్లాక్ డీల్ రూపంలో 500 మిలియన్ డాలర్లు వెచ్చించి 2.5 శాతం కంటే ఎక్కువ వాటాను సొంతం చేసుకుంది. బ్లాక్ డీల్ తర్వాత అదానీ గ్రీన్ షేర్లలో భారీ ర్యాలీ నెలకొంది.

ఇండ్రాటేలో 12.09 గంటల సమయంలో కంపెనీ షేర్లు 2.69 శాతం లాభంతో రూ.991 వద్ద ర్యాలీ కొనసాగిస్తున్నాయి. దీని తర్వాత గ్రూప్ లోని అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (AEML) తర్వాత గ్రూప్ కంపెనీలో ఎన్విరాన్‌మెంట్, సోషల్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్(ESG) ఫండ్ ద్వారా ఇది రెండవ పెట్టుబడి. దీనికి ముందు 2020లో QIA అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌ని కొనుగోలు చేసింది. అప్పట్లో కంపెనీలో దాదాపు 25.1 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రమోటర్ల యూనిట్ ఇన్ఫినిట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలో 2.8 శాతం వాటాను రూ.4,131 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా సోమవారం ఈ డీల్ జరిగింది. ప్రమోటర్ల యూనిట్ 4,48,82,500 షేర్లను లేదా 2.8 శాతం వాటాను ఒక్కో షేరుకు రూ.920.43 చొప్పున విక్రయించింది. దీంతో డీల్ విలువ దాదాపు రూ.4,131 కోట్లుగా నమోదైంది.
ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి చెందిన అనుబంధ సంస్థ INQ హోల్డింగ్ LLC, అదానీ గ్రీన్ ఎనర్జీలో 4.26 కోట్ల షేర్లను లేదా 2.68 శాతం కొనుగోలు చేసింది. ఒప్పందం తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీలో ఇన్ఫినిట్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్స్ వాటా 3.37 శాతం నుంచి 0.57 శాతానికి తగ్గింది. జూన్ త్రైమాసికం చివరి నాటికి ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ కంపెనీలో 56.27 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ AGELలో 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీంతో కంపెనీలో ఆయన వాటా 2.5 శాతానికి పైగా పెరిగింది.


Click it and Unblock the Notifications