Adani Share: ఒక్క నెలలో డబ్బులు రెండితలు.. మార్కెట్లో అదానీ స్టాక్ పరుగులు.. మీ దగ్గర ఉందా..?

Adani Green Share: అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ నివేదికతో ఇటీవల అదానీ గ్రూప్ కంపెనీ లిస్టెడ్ స్టాక్స్ కుప్పకూలాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు తమకు ఉన్న వాటాలను ఆ కంపెనీల్లో నష్టాలకు సైతం విక్రయించారు. అయితే కొందరు మాత్రం దీనిని సరైన అవకాశంగా భావించి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు వారి పంట పండిందని చెప్పుకోవాలి. అందుకే మన పెద్దవారు ధైర్యే సాహసే లక్ష్మి అని అన్నారు.

అదానీ కంపెనీలను నమ్మి పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు మంచి కాలం మళ్లీ తిరిగి వచ్చిందని చెప్పుకోవాలి. గ్రూప్ కు చెందిన అదానీ గ్రీన్స్ స్టాక్ మార్కెట్లో తిరిగి పుంజుకుంది. దీంతో షేర్ల ధర రికార్డుల మోత మోగిస్తోంది. ఈ స్టాక్ మార్కెట్లో వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకటంతో ఇన్వెస్టర్లు బంపర్ రిటర్న్స్ పొందారు. ప్రస్తుతం స్టాక్ ధర దాదాపు రూ.1,031 వద్ద ఉంది.

Adani green stock doubled investors money in just one month with 120 percent return, Know details

ప్రస్తుతం స్టాక్ తన 52 వారాల కనిష్ఠ స్థాయి కంటే 123 శాతం అధిక విలువను కలిగి ఉంది. కల్లోలం తర్వాత అదానీ గ్రూప్ చేపట్టిన నష్టనివారణ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదానీ గ్రీన్ తన పెట్టుబడిదారులను ధనవంతులుగా మార్చేసింది. గడచిన నెల రోజుల కాలాన్ని పరిశీలిస్తే.. ఫిబ్రవరి 27న స్టాక్ ధర రూ.462 వద్ద ఉంది. గత శుక్రవారం చివరి ట్రేడింగ్ సమయంలో స్టాక్ ధర రూ.1,031గా ఉంది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ నెలరోజుల కిందట కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే ఇప్పుడు దాని విలువ దాదాపు రూ.2 లక్షల కంటే ఎక్కువగా మారి ఉండేది.

స్టాక్ ఇప్పటికీ తన 52 వారాల గరిష్ఠమైన రూ.3,050 కంటే చాలా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో 52 వారాల కనిష్ఠ ధర రూ.439గా ఉంది. ఈ క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 1.63 లక్షల కోట్లుగా ఉంది. గత నెలలో అదానీ గ్రీన్ స్టాక్ బాగా రికవరీ అయ్యింది. దీనికి అతిముఖ్యమైన కారణం అమెరికాకు చెందిన GQG పార్టనర్ అదానీ గ్రూప్‌కు చెందిన నాలుగు కంపెనీలలో భారీ పెట్టుబడులను ప్రకటించటమే. వాటిలో అదానీ గ్రీన్ కూడా ఉంది. ఈ సంస్థ అదానీ గ్రీన్ వాటాలను ఒక్కో షేరుకు రూ.504.60 చెల్లించింది. మెుత్తంగా ఈ కంపెనీలో రూ.2,806 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. దీంతో స్టాక్ బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+