Adani Group: భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. అనూహ్యంగా ఆయనను టార్గెట్ చేసిన హిండెన్ బర్గ్ తన వ్యాపార కార్యకలాపాలను క్లోజ్ చేయగా.. ఇటీవల అమెరికా ప్రభుత్వం చేపడుతున్న దర్యాప్తు చేస్తున్న లంచాల కేసుకు సంబంధించిన చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు.
ఈ క్రమంలో అదానీ గ్రూప్ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ శ్రీలంక కేంద్రంగా చేపట్టాలని గతంలో నిర్ణయించిన రెండు పవర్ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. ఇదే విషయాన్ని కంపెనీ శ్రీలంక ప్రభుత్వ సంస్థకు తాజాగా పంపిన లేఖలో వెల్లడించింది. ఈ నిర్ణయంతో కంపెనీ ఏకంగా బిలియన్ డాలర్ల విలువైన విండ్ ఎనర్జీ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకోవటం గమనార్హం. పర్యావరణ అనుమతుల్లో జాప్యం, సుప్రీంకోర్టులో ప్రాజెక్టుపై కేసు వంటి కారణాలతో ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

అయితే ఈ ప్రాజెక్టు రద్దును నివారించటానికి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను తిరిగి చర్చించడానికి మరో క్యాబినెట్ నియమించిన చర్చల కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఏర్పాటు చేయబడతాయని అదానీ గ్రీన్ ఎనర్జీ ఒక ప్రకటనలో పేర్కొంది. లంక సార్వభౌమ హక్కులను గౌరవిస్తూ.. ప్రాజెక్టు నుంచి గౌరవపూర్వకంగా తప్పుకోవాలని నిర్ణయించినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. దీని కింద గతంలో కుదుర్చుకున్న ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు కదలక మునుపే శ్రీలంకలో నిలిచిపోనున్నాయని తెలుస్తోంది.
దాదాపు అన్ని అనుమతులు పొందటం చివరి దశలో ఉన్న తరుణంలో కంపెనీ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ దాదాపుగా 5 మిలియన్ డాలర్లను ఖర్చు కూడా చేసింది. గతంలో జరిగిన ఒప్పందం కింద అదానీ గ్రూప్ శ్రీలంక ఇంధన మౌలిక సదుపాయాలకు మద్దతుగా 220 KV, 400 KV పవర్ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ విస్తరణతో పాటు, మన్నార్ పూనెరిన్‌లలో 484 మెగావాట్ల విండ్ ఎనర్జీ కేంద్రాలను స్థాపించాల్సి ఉంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మన్నార్ ప్రాంతంలో పర్యావరణ అనుమతుల్లో జాప్య, హైకోర్టులో కొనసాగుతున్న కేసుతో ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని అదానీ నిర్ణయించారు.
ప్రస్తుతం పెట్టుబడిని వెనక్కి తీసుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో శ్రీలంక ప్రభుత్వం ఏదైనా అవకాశాలను కల్పిస్తే కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడికి ఉన్న అవకాశాలను పరిశీలించటానికి తాము సిద్ధంగానే ఉన్నామని అదానీ గ్రీన్ వెల్లడించింది. అయితే ఈ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత నేడు ఇంట్రాడేలో మధ్యాహ్నం 3 గంటలకు అదానీ గ్రీన్ స్టాక్ ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.919 స్థాయి వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. శ్రీలంక ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్త రావటంతో మార్కెట్లో స్టాక్ ధర దాదాపు 3 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications