Adani Green Q2 Results: అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ మంచి లాభాలను నమోదు చేసింది.
ఏడాది ప్రాతపదికన కంపెనీ లాభం 149 శాతం పెరిగి రూ.371 కోట్లుగా నిలిచింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.149 కోట్లుగా ఉంది. అలాగే కంపెనీ మెుత్తం ఆదాయం 54 శాతం పెరిగి రూ.2,589 కోట్లకు చెరుకుంది. Q2FY23లో రూ.1,514 కోట్లతో పోలిస్తే మొత్తం ఖర్చులు Q2FY24లో 43 శాతం పెరిగి రూ.2,160 కోట్లకు చేరాయి. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీ అధిక ఇంధన విక్రయాలను సాధించింది.

యాజమాన్య అవిశ్రాంత మెరుగైన పనితీరు కారణంగానే క్యూ2లో మంచి ఫలితాలు వెలువడ్డాయని అదానీ గ్రీన్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ సింగ్ వెల్లడించారు. ఖవ్డా వద్ద అత్యంత అధునాతన TOPCon సోలార్ మాడ్యూల్‌లను అలాగే భారతదేశంలోనే అతిపెద్ద, అత్యంత సమర్థవంతమైన 5.2 MW విండ్ టర్బైన్‌లలో ఒకటిగా ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికోసం 5,000 మందికి పైగా వర్క్‌ఫోర్స్‌ని మోహరించినట్లు ప్రకటించారు.
విండ్-ఎనర్జీ పోర్ట్‌ఫోలియో కోసం గుజరాత్‌లో 230 మెగావాట్ల సామర్థ్య జోడింపు, హైబ్రిడ్ పోర్ట్‌ఫోలియోలో సెప్టెంబర్ త్రైమాసికంలో ఇంధన విక్రయం ఆరు రెట్లు లేదా 561 శాతం పెరిగి 2,057 మిలియన్ యూనిట్లకు చేరుకుందని కంపెనీ ప్రకటించింది. దీనికి కారణంగా రాజస్థాన్‌లో 1,150 మెగావాట్ల హైబ్రిడ్ సామర్థ్యం కారణంగా కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయంలో నేడు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ షేర్ ధర 4.93 శాతం పెరిగి రూ.913.80 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications