Adani: ఫండ్ రైజింగ్ కోసం అదానీ గ్రీన్ మీటింగ్.. ఈ మార్గాల్లో ముందుకెళ్లాలని ప్లానింగ్
Adani: హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం పలు ఇబ్బందులు ఎదుర్కొన్న అదానీ గ్రూపునకు తత్వం ఇప్పుడు బోధపడినట్లుంది. అప్పులు తీర్చేందుకు గతంలో అంతగా శ్రద్ధ వహించని అదానీ కంపెనీలు ప్రస్తుతం రుణాల నుంచి విముక్తి కావడమే పరమావధిగా ప్రవర్తిస్తున్నాయి. తద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసం చూరగొనాలని ప్లాన్ చేస్తున్నాయి.
నిధుల సమీకరణ ప్రతిపాదనను పరిశీలించి, ఆమోదించేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డు సమావేశం కానుంది. ఇందుకోసం మే 13న మీటింగ్ జరగనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అదానీ గ్రూప్ కంపెనీ బోర్డు అహ్మదాబాద్‌లో సమావేశమై.. ఈక్విటీ షేర్లు లేదా ఏవైనా ఇతర సెక్యూరిటీల ద్వారా నిధుల సేకరణ కోసం మార్గం అన్వేషించనున్నట్లు వెల్లడించింది.

ప్రైవేట్ ప్లేస్‌మెంట్, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్, ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు అదానీ గ్రీన్ ప్రయత్నిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. అవి కుదరని పక్షంలో అందుబాటులోని ఆయా చట్టాలను అనుసరించి ఏదైనా ఇతర పద్ధతి ద్వారా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. వివిధ పద్ధతుల కలయికను సైతం పరిశీలిస్తున్నట్లు చెప్పింది.
కంపెనీ సెక్యూరిటీలలో డీల్ చేయకుండా మే 10న మార్కెట్ వేళలు ముగిసిన తర్వాత నుంచి మే 15న వరకు ట్రేడింగ్ విండో మూసివేయబడుతుంది. ప్రస్తుతం గ్రూపు తీసుకుంటున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే, మళ్లీ గత వైభవం సాధించాలని కసితో ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది. కాగా అదానీ గ్రీన్ షేర్ల ట్రేడింగ్ 902.20 వద్ద దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది.


Click it and Unblock the Notifications