అహ్మదాబాద్: గుజరాత్‌కు చెందిన దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యావరణానికి హాని కలిగించని విధంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో రాణిస్తోన్న కంపెనీలకు అందజేసే అవార్డు అది. అదాని గ్రూప్ సంస్థల్లో ఒకటైన అదాని గ్రీన్ ఎనర్జీ ఈ అవార్డు కోసం ఎంపికైంది. ప్రతి సంవత్సరం గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎంపిక చేసే కంపెనీలు సాధించిన కృషికి గుర్తింపుగా ప్రదానం చేసే ప్రైమ్ బ్యాడ్జ్ అవార్డు ఇది. ఇన్‌స్టిట్యూషనల్ షేర్ హోల్డర్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (ISS ESG) ఈ అవార్డును అందజేస్తుంటుంది.
అమెరికాకు చెందిన కార్పొరేషన్ ఇది. మేరీల్యాండ్ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రతి సంవత్సరం పర్యావరణం, సామాజికం, గవర్నెన్స్ రంగాల్లో కృషి చేసిన కార్పొరేట్ కంపెనీలను ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తుంటుంది. ఈ సారి అదాని గ్రీన్ ఎనర్జీకి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అదాని సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సుస్థిర అభివృద్ధిని నమోదు చేసినందుకు ఐఎస్ఎస్ఈఎస్‌జీ సంస్థ ప్రతిష్ఠాత్మక బీ రేటింగ్‌తో కూడిన ప్రైమ్ బ్యాడ్జ్ అవార్డు కోసం అదాని గ్రీన్ ఎనర్జీని ఎంపిక చేసినట్లు పేర్కొంది.

ప్రపంచ స్థాయిలో పునరుద్ధరించిన ఇంధన వనరులను ఉత్పత్తి చేసే 25 శాతం వరకు ఉన్న కంపెనీల్లో తమను గుర్తించినట్టయిందని వివరించింది. అదాని గ్రీన్ ఎనర్జీ- 2025 నాటికి 25 గిగావాట్ల మేర పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా 150 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ ప్లాంట్‌ను శుక్రవారమే ప్రారంభించింది. దీనితో రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో ఇప్పటిదాకా 5,070 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో కూడిన ప్లాంట్లను నెలకొల్పినట్టయిందని అదాని గ్రూప్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications