AP News: సీఎం చంద్రబాబుకు అదానీ తలనొప్పి.. కొత్తగా రూ.850 కోట్లు నష్టం, డెడ్ లైన్ మిస్..!
Adani Solar: ప్రస్తుతం అదానీ లంచాల వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచనంగా మారింది. అయితే ఇందులో ఎవరు ఎవరికి ఎంత డబ్బు కట్టబెట్టారనే విషయాలు పేర్లు లేకపోవటంపై న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగిస్తామని హామీ ఇవ్వటంతో పాటు దేశీయ ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ బలమైన రేటింగ్ కొనసాగించటంతో అదానీ లిస్టెడ్ స్టాక్స్ భారీ పెరుగుదలను చూశాయి.
అదానీ లంచాల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కొనసాగుతున్న వేళ.. అదానీ గ్రీన్ ఎనర్జీ తన సోలార్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఏపీకి ఇప్పటి వరకు ఎటువంటి విద్యుత్‌ను సరఫరా చేయలేదని తేలింది. వాస్తవానికి సెప్టెంబరు 2024 నుంచి 3,000 మెగావాట్లను అందించాలని మొదట నిర్ణయించిన ఈ ప్రాజెక్ట్, గడువు దాటి రెండు నెలలు గడిచినా సప్లై ప్రారంభం కాలేదు. అయితే సవరించిన షెడ్యూల్ ప్రకారం విద్యుత్ సరఫరా ఏప్రిల్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ 1,000 మెగావాట్ల విద్యుత్‌ను పొందడం ప్రారంభిస్తుందని, మరింత ఆలస్యం కారణంగా అదనంగా 1,000 మెగావాట్ల కాలపరిమితిని జనవరి 2026కి మార్చబడింది. ఇది వాస్తవంగా సెప్టెంబరు 2025 నాటికి వాగ్దానం చేసిన 6,000 మెగావాట్ల కంటే చాలా తక్కువ.

అదానీపై లంచం ఆరోపణలకు కేంద్రంగా ఉన్న గుజరాత్ ఆధారిత సోలార్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఏపీకి సరఫరా చేయబడే విద్యుత్ kWhకి రూ.2.49 చౌకగా అందుబాటులో ఉండని వెల్లడైంది. ఇక్కడ సోలార్ ప్యానెల్స్, సోలార్ సెల్‌లపై విధించే ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయబడుతుందని డీల్ పత్రాల ప్రకారం బయటపడింది. దీని కారణంగా విద్యుత్ టారిఫ్ కిలోవాట్ కి అదనంగా 50 పైసలు పెరగనుంది. అంటే కిలోవాట్ ధర రూ.2.49 నుంచి రూ.3.069కి పెరగనుంది. అంటే దీని ప్రకారం ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు అదనంగా మరో రూ.850 కోట్లు సమర్పించుకోవాల్సిందేనని వెల్లడైంది. వాస్తవానికి ఇది ప్రజలపై మరింత భారాన్ని మోపవచ్చని తెలుస్తోంది.
అదానీ గ్రీన్ ఎక్స్ఛేంజీలలో విద్యుత్తు అధిక ధరలకు విక్రయిస్తోంది. ఏపీకి సరఫరా ఆలస్యం జరిగినప్పటికీ అదే ప్రాజెక్ట్ నుంచి విద్యుత్‌ను విక్రయిస్తోంది. యూనిట్‌కు సగటున రూ.3.5 ధరగా విక్రయం జరుగుతోంది. ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అంగీకరించిన యూనిట్‌కు రూ.2.42 కంటే ఇది 40 శాతం అధికం. ఇదే క్రమంలో అదానీ సోలార్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో.. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications