Adani Green Energy: అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తన క్యూ1 ఫలితాలను ప్రకటించింది. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఉన్న కంపెనీ ఊహించని రాబడులతో మార్కెట్లను ఆశ్చర్యపరిచింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 95 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మెుదటి త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.629 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.323 కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్ సంస్థ యొక్క మొత్తం ఆదాయం Q1FY25లో 22.5 శాతం పెరిగి రూ.3,122 కోట్లకు చేరుకోగా క్రితం ఏడాది ఇదే సమయంలో రూ.2,550 కోట్లుగా ఉంది.

మొదటి త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ సామర్థ్యం ఏడాదికి 31 శాతం పెరిగి 10,934 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో గ్రీన్‌ఫీల్డ్ జోడింపులతో సహా ఖవ్దాలో 2,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యం, రాజస్థాన్‌లో 418 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యం, గుజరాత్‌లో 200 మెగావాట్ల విండ్ ఎనర్జీ సామర్థ్యం ఉన్నాయి.
గుజరాత్‌లోని ఖవ్డాలో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-లొకేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ 30 GW అభివృద్ధి చేయటంలో తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సీఈవో అమిత్ సింగ్ పేర్కొన్నారు. దీనిని వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సోలార్ మాడ్యూల్స్ ఏర్పాటులో అధునాతన రోబోటిక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. అదానీ గ్రీన్ 2030 నాటికి సామర్థ్య లక్ష్యమైన 50 GWని సాధించడానికి బాగా ట్రాక్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ లాభదాయకత భారీగా పెరగటంతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. దీనికి అనుగుణంగా రేపు మార్కెట్లలో కంపెనీ షేర్లు ఫోకస్‌లో కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications