Adani Shares: అదానీ షేర్లకు అబుదాబీ దెబ్బ.. నష్టాల్లో ట్రేడింగ్.. పూర్తి వివరాలు..
Adani Shares: ప్రస్తుతం అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత ఆరోపణలు కొనసాగుతున్నప్పటికీ భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి.
అయితే తాజాగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ స్టాక్స్ ఈరోజు మార్కెట్లో ఫోకస్‌లో కొనసాగుతున్నాయి. అబుదాబీకి చెందిన IHC అదానీ గ్రూప్ కంపెనీల్లోని వాటాలను విక్రయించటమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో భాగంగా ఉన్న పెట్టుబడులను విక్రయించేందుకు కొనుగోలుదారుతో ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే వారి వివరాలను మాత్రం ప్రకటించలేదు.

తన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు IHC అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఉదయం 11 గంటలకు అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు ఎన్ఎస్ఈలో 1.63 శాతం క్షీణించి రూ.994.85 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు 1.82 శాతం నష్టపోయి రూ.815.40 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
లావాదేవీలను అమలు చేయడానికి అవసరమైన అన్ని విధానాలను పూర్తి చేస్తున్నామని IHC తెలిపింది. IHC గత ఏడాది ఏప్రిల్‌లో మూడు అదానీ గ్రూప్ కంపెనీలలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.7,700 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ- అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీలు ఒక్కోదానిలో రూ.3,850 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టింది.


Click it and Unblock the Notifications