Ambuja Cements: దేశంలో ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే అదానీ ఫ్యామిలీ ఒడిఒడిగా తమ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తున్నారు. గత ఏడాది అనేక ఆరోపణలు, చట్టపరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ 2024లో దూకుడు పెంచారు.
తాజాగా అదానీ గ్రూపునకు సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. గత ఏడాది కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్‌లో అదానీ కుటుంబం రూ.6,661 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ విషయాన్ని గ్రూప్ స్వయంగా ధృవీకరించటం పెట్టుబడిదారుల్లో కోలాహలాన్ని నింపింది. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ కంపెనీలో అదానీ కుటుంబ వాటా 3.6 శాతం పెరిగి 66.7 శాతానికి చేరుకుంది. 2028 నాటికి తమ సామర్థ్యాన్ని ఏటా 140 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని యోచిస్తున్న అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారానికి ఈ పెట్టుబడి కీలకం కానుందని పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దీనికి ముందు అక్టోబర్ 2022లో డైరెక్టర్ల బోర్డు ఆమోదించిన వారెంట్ల జారీ ద్వారా ప్రమోటర్ అదానీ కుటుంబం కంపెనీలో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ACC లిమిటెడ్ అనే మరో సిమెంట్ కంపెనీలో అంబుజా సిమెంట్స్‌కు నియంత్రణ వాటా కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలో అదానీ కుటుంబ వాటా 3.6 శాతం పెరిగి మొత్తం 66.7 శాతానికి చేరుకుంది. అంబుజా సిమెంట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అజయ్ కపూర్ మాట్లాడుతూ పెట్టుబడి "వేగవంతమైన వృద్ధి, మూలధన నిర్వహణ కార్యక్రమాలు మొదలైనవాటిని" సాధించడంలో సహాయపడుతుందని అన్నారు.
గురువారం ట్రేడింగ్‌లో అంబుజా సిమెంట్స్ షేరు 2.5% పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.617ను తాకింది. ఈ సంవత్సరం YTDలో స్టాక్ 15%, గత ఆరు నెలల్లో 45% పెరిగింది. ఈ స్టాక్ ఏడాదిలో 71% పెరిగింది. దీని 52 వారాల గరిష్ట ధర రూ.624.55.. 52 వారాల కనిష్ట ధర రూ.358.20. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,21,779.62 కోట్లుగా ఉంది. పెట్టుబడిదారులు సైతం కంపెనీ భవిష్యత్తుపై బలమైన ధోరణిని కలిగి ఉండి కొత్త పెట్టుబడులను పెడుతున్నారు.


Click it and Unblock the Notifications