Adani Enterprises: అదానీ గ్రూప్ లో ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ తన డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కోల్ ట్రేడింగ్, ఎయిర్ పోర్టుల వ్యాపారాన్ని కంపెనీ దీనికింద నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ క్యూ-3లో మంచి పనితీరును కనబరిచింది.

కంపెనీ లాభాలు..
అదానీ ఎంటర్ ప్రైజెస్ Q3 నికర లాభం రూ.820.06 కోట్లుగా నమోదైంది. దీనికి ముందు సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ.460 కోట్లుగా ఉంది. 2021 డిసెంబర్ క్వార్టర్ సమయంలో కంపెనీ రూ.11.63 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. ఏడాది ప్రాతిపధికన కంపెనీ వ్యాపార ఆదాయం 42 శాతం పెరిగి రూ.26,612.23 కోట్లకు చేరుకుంది. 2021లో ఇదే కాలానికి ఆదాయం రూ.18,757.87 కోట్లుగా ఉంది.

గడచిన 9 నెలల్లో..
ఆర్థిక సంవత్సరం గడచిన తొమ్మిది నెలల కాలానికి అదానీ ఎంటర్ ప్రైజెస్ నికర లాభం ఏకంగా 271 శాతం పెరిగింది. దీంతో మూడు త్రైమాసికాలకు కలిపి నికర లాభం రూ.1,750 కోట్లుగా నమోదైంది. మంచిరియల్ HAM ప్రాజెక్ట్ కోసం రోడ్ బిజినెస్ మూడవ తాత్కాలిక CODని సాధించగా.. వాటర్ బిజినెస్ రూ.3,246 కోట్ల విలువైన EPC ప్రాజెక్ట్ ను పొందినట్లు కంపెనీ వెల్లడించింది.

గౌతమ్ అదానీ ఏమన్నారంటే..
గత మూడు దశాబ్దాలుగా ఏడాది తర్వాత ఏడాది అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశ అత్యంత విజయవంతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంక్యుబేటర్‌గా దాని స్థానాన్ని ధృవీకరించడమే కాకుండా కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాన్ని నిర్మించడంలో ట్రాక్ రికార్డ్‌ను ప్రదర్శించిందని ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు.
మెగా-స్కేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలు తమ బలమని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ అస్థిరత తాత్కాలికమైనవేనని అభిప్రాయపడ్డారు. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో స్వల్ప లాభాల్లో ట్రేడవుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications