Adani Enterprises FPO: పట్టువదలని విక్రమార్కుడు అనే మాట మనం పలుమార్లు విని ఉంటాం. కానీ అది గౌతమ్ అదానీ విషయంలో సరిగ్గా సరిపోలుతుంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ FPO విషయంలో ముందునుంచి ఒకే మాటమీద ఉన్న అదానీ.. దానిని చివరికి నిజం చేసుకున్నారు. ఈ క్రమంలో చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలినప్పటికీ దానిని ఇదిగమించి ముందుకు సాగారు.

ముచ్చటగా మూడోరోజు..
అదానీ ఎంటర్‌ప్రైజెస్ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించింది. అందరూ అసాధ్యమే అనుకున్నదానిని సునాయాసంగా సుసాధ్యం చేశారు అదానీ. ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ చివరిరోజు పూర్తిగా సబ్ స్క్రైబ్ అయ్యింది. మెుత్తం 45.5 మిలియన్ షేర్లను కంపెనీ ఆఫర్ చేయగా 50.11 మిలియన్ షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. చివరి రోజు అంటే జనవరి 31న FPO 1.1 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను సూచిస్తుంది. ఇది పూర్తిగా సబ్ స్క్రైబ్ అయిన యాంకర్ పోర్షన్ ను మినహాయించింది.

ముందుగా వెనకడుగు..
అదానీ గ్రూప్ కంపెనీ వ్యాపారాలపై అమెరికా రీసెర్చ్ సంస్థ సంచలన రిపోర్టు ప్రకటించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారు. ఆ సమయంలో మార్కెట్లో స్టాక్ ట్రేడవుతున్న ధర కంటే FPO ప్రైస్ బ్యాండ్ ధర ఎక్కువగా ఉండటంతో అందరూ కొడుగోలుకు విముకత చూపారు. అయితే ఆఖరి రోజు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన వాటా 326 శాతానికి ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూ తెరవడానికి కొన్ని రోజుల ముందు యాంకర్ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 6,000 కోట్ల విలువైన షేర్లను సబ్‌స్క్రైబ్ చేశారు.

అబుదాబి సంస్థ ప్రకటన..
అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) అదానీ FPO విషయంలో పెద్ద ప్రకటన చేసింది. కంపెనీ ఫ్లోట్ చేసిన రూ.20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ లో 400 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడతానని ప్రకటించింది. భారత కరెన్సీ ప్రకారం ఈ డీల్ విలువ దాదాపు రూ.3,200 కోట్లకు సమానమైనదిగా తెలుస్తోంది. అంటే FPOలో 16 శాతాన్ని IHC సబ్‌స్క్రైబ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

మెుదటి రోజు డీలా..
అదానీ ఎంటర్ ప్రైజెస్ FPO ప్రారంభం రోజు అంటే జనవరి 27న కేవలం ఒక్క శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. ఇక రెండో రోజు విషయాన్ని గమనిస్తే కేవలం 3 శాతంగా మాత్రమే సబ్‌స్క్రిప్షన్ నమోదు కావటంతో మార్కెట్ వర్గాలు ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఫెయిల్ అవుతుందని భావించాయి. అయితే ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపేందుకు అదానీ గ్రూప్ చేసిన అనేక ప్రయత్నాలు మూడోరోజు మంచి ఫలితాలను ఇచ్చాయని చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications