April Moon Retail: ఇప్పటి వరకు అనేక రంగాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న అదానీ గ్రూప్ తాజాగా మరిన్ని కొత్త వ్యాపారాలను కొనుగోలుచేస్తూనే ఉంది. నిరంతరాయంగా అదానీ తన షాపింగ్ కొత్త రంగాల్లోకి అడుగుపెడుతోంది.
అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన జాయింట్ వెంచర్ అయిన ఏప్రిల్ మూన్ రిటైల్ పెద్ద కొనుగోలు నిర్వహించింది. ఏప్రిల్ మూన్ రిటైల్ కోకోకార్ట్ వెంచర్స్‌లో 74% వాటాను ఏకంగా రూ.200 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల ధర స్వల్పంగా పెరిగి రూ.3,131.15 వద్ద ముగిశాయి. వాస్తవానికి అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్(AAHL) జాయింట్ వెంచర్ కంపెనీ ఏప్రిల్ మూన్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్(AMRPL).

ఏప్రిల్ మూన్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దాని ప్రస్తుత వాటాదారులైన కరణ్ నుండి కోకోకార్ట్ వెంచర్స్‌లో వాటాలను కొనుగోలు చేయడానికి ఆమోదించినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. దీంతో కంపెనీ కోకోకార్ట్ వెంచర్స్‌లో 74 శాతం వాటాను కొనుగోలు చేయగలదు. ఈ డీల్ అక్టోబర్ 31, 2024 నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. కోకోకార్ట్ వెంచర్స్ రిటైల్ అండ్ హోల్‌సేల్ కొనుగోలు విక్రయాలు, లేబులింగ్, రీలేబులింగ్, పునఃవిక్రయం చేయడం, దిగుమతి చేయడం, ఎగుమతి చేయడం, రవాణా చేయడం, నిల్వ చేయడం, ప్రమోషన్ చేయడం, మార్కెటింగ్ చేయడం లేదా వస్తువులను సరఫరా చేయడం వంటి వ్యాపారాల్లో నిమగ్నమై ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ.99.63 కోట్లుగా నమోదైంది.
ఇటీవల అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ప్రకటించింది. ఈ కంపెనీ బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. ఇటీవల కంపెనీ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అదానీ జీసీసీ ప్రైవేట్ పేరుతో అనుబంధ కంపెనీని సెప్టెంబర్ 24న విలీనం చేసిందని, దాని సర్టిఫికేట్ సెప్టెంబర్ 25న అందిందని పేర్కొంది. అహ్మదాబాద్‌లో రిజిస్టర్ అయిన అదానీ GCC వ్యాపార పరివర్తన, బ్యాక్ ఆఫీస్ సేవలను అందిస్తుంది. ఇందులో ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, HR, IT సేవలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డేటా ఎంట్రీ ప్రాసెసింగ్ వంటి సేవలు అందించబడుతున్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications