Adani Shares: ఈ ఏడాది గౌతమ్ అదానీ పరిస్థితి అస్సలు ఏమాత్రం బాగోలేదు. వరుసగా ఆయన గ్రూప్ సంస్థలపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హిండెన్ బర్గ్, ఓసీసీఆర్పీ తర్వాత పండోరా పేపర్లకు అదానీ కంపెనీలకు లింకులపై వార్తలు బయటకు వస్తున్నాయి.
ఈ క్రమంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్స్ & సెజ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ఉదయం ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తర్వాత వార్తల్లోకి రానున్నాయి. పండోరా పేపర్స్ విచారణలో భాగంగా ఆఫ్‌షోర్ కార్పొరేట్ సర్వీస్ ప్రొవైడర్ ట్రైడెంట్ ట్రస్ట్ రికార్డులను యాక్సెస్ చేసింది. ఈ క్రమంలో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్(BVI)లో రిజిస్టర్ చేయబడిన రెండు ఆఫ్‌షోర్ షెల్ కంపెనీలతో అదానీ గ్రూప్‌కి లింక్ ఉన్నట్లు తెలుస్తోంది.

అస్పష్టమైన మారిషస్ ఫండ్ ద్వారా అదానీ ఫ్యామిలీ, వ్యాపార భాగస్వాములు అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఓసీసీఆర్పీ నివేదిక గురువారం వెల్లడించింది. OCCRP ద్వారా యాక్సెస్ చేయబడిన పత్రాల ఆధారంగా.. ఈ సంస్థల వెనుక ఉన్న ఇద్దరు వ్యక్తులు అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి సహచరులని వెల్లడైంది. ఒకరు యూఏఈ జాతీయుడు నాజర్ అలీ షాబాన్ అహ్లీ కాగా మరొకరు తైవాన్ జాతీయుడు చాంగ్ చుంగ్-లింగ్ అని తేలింది. అహ్లీ గల్ఫ్ ఆసియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌ను ఉపయోగించగా, చాంగ్ లింగో ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌ను ఉపయోగించినట్లు తేలింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున పొజిషన్లు సంపాదించడానికి, ట్రేడింగ్ చేసేందుకు బెర్ముడా ఫండ్‌ను ఉపయోగించారని ఫైనాన్షియల్ టైమ్ నివేదించింది. ఆదారాలను ఓసీసీఆర్పీ వెల్లడించినప్పటికీ ఇదంతా అబద్దమని అదానీ గ్రూప్ మీడియా ప్రకటన ద్వారా వెల్లడించింది. అయితే మార్కెట్లలో భయాందోళనలకు గురైన రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం రిస్క్ తీసుకోకూడదని తమ షేర్లను విక్రయించటంతో అదానీ మార్కెట్ క్యాప్ రూ. 36 వేల కోట్ల మేర నిన్న ఆవిరైంది. షేర్ల పతన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications