Adani Electricity: నెం-1 స్థానంలో నిలిచిన అదానీ.. ముంబైలో హవా.. టాటాలను వెనక్కు నెట్టి
Adani Electricity: దేశంలోని 71 విద్యుత్ పంపిణీ సంస్థల జాబితాలో అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం పాలన, ఆర్థిక స్థిరత్వం, పనితీరు, ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్‌మెంట్ వంటి ప్యారామీటర్స్ ఆధారంగా లిస్ట్ రూపొందించబడింది. అదానీ ఎలక్ట్రిసిటీ గ్రేడ్ A+ పొందిందని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.
మెుత్తం జాబితాలో అదానీ ఎలక్ట్రిసిటీ తప్ప మెుదటి ఐదు స్థానాల్లో మరో ప్రైవేటు సంస్థ లేకపోవటం గమనార్హం. గత ఐదేళ్లలో కస్టమర్-సెంట్రిక్ ఫోకస్ టారిఫ్‌లను తగ్గించడానికి, స్థిరీకరించడానికి దోహదపడిందని అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ MD, కందర్ప్ పటేల్ తెలిపారు. ఇదే క్రమంలో విద్యుత్ కొనుగోలు ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి సాంకేతికత, ఆటోమేటెడ్ వర్క్‌ఫ్లో మేనేజ్‌మెంట్, డిజిటల్-ఫస్ట్ అప్రోచ్ తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవటానికి దోహదపడ్డాయని ఆయన వెల్లడించారు.

తమ సేవలను సేవలు మరియు మౌలిక సదుపాయాలను గ్లోబల్ బెంచ్‌మార్క్‌లను అధిగమించేలా మెరుగుపరచడం కొనసాగిస్తామని పటేల్ తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీలో తమ వాటాను 60 శాతానికి రెట్టింపు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తమ ప్రయాణంలో అండగా నిలిచిన వాటాదారులకు, ముంబైకి కృతజ్ఞతలు తెలిపారు.
ర్యాంకింగ్ దేశవ్యాప్తంగా 45 రాష్ట్ర డిస్కమ్‌లు, 14 ప్రైవేట్ డిస్కమ్‌లు, 12 పవర్ డిపార్ట్‌మెంట్‌లతో కూడిన 71 పవర్ డిస్ట్రిబ్యూటర్లను కవర్ చేసింది. డిజిటల్ బిల్లింగ్, యూపీఐ చెల్లింపులకు భాగస్వామ్యం, అధునాతన మీటర్ రీడింగ్ టెక్నాలజీ, తక్కువ పంపిణీ నష్టాలు వంటి కారణాల వల్ల అదానీ సంస్థ మెరుగైన స్కోర్ పొందగలిగిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications