అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన అదానీ డిజిటల్ ల్యాబ్స్ ఆన్‌లైన్ రైలు బుకింగ్, సమాచార ప్లాట్‌ఫారమ్ అయిన ట్రైన్‌మ్యాన్‌ను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఈ విషయం తెలిపింది. దానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైన్‌మ్యాన్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో 100 శాతం వాటాను ప్రతిపాదిత కొనుగోలుకు సంబంధించి వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది అదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ట్రైన్‌మ్యాన్ ఆన్‌లైన్ రైలు బుకింగ్, సమాచార వేదికగా ఉంది.అయితే ఈ డీల్ కు సంబంధించి ఆర్థిక నిబంధనలను కంపెనీ వెల్లడించలేదు.IIT-రూర్కీ గ్రాడ్యుయేట్లు వినీత్ చిరానియా, కరణ్ కుమార్ గురుగ్రామ్ లో SEPL IRCTC-అధీకృత రైలు టిక్కెట్ బుకింగ్ స్టార్ట్-అప్ ట్రైన్‌మ్యాన్‌ను ప్రారంభించారు. ఇది ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందించే ఆల్-ఇన్-వన్ రైలు టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ గా మంచి పేరు తెచ్చుకుంది.

ఈ సంస్థ రైళ్లలో సీట్ల అందుబాటు, పీఎన్‌ఆర్ స్టేటస్, లైవ్ స్టేటస్ వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది. కంపెనీ ఈ మధ్యే అమెరికాకు చెందిన పెట్టుబడిదారులు గుడ్‌వాటర్ క్యాపిటల్, హేమ్ ఏంజెల్స్ ఇతరులతో సహా $1 మిలియన్‌ను నిధులు సేకరించింది. US-ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ జనవరిలో అదానీ గ్రూప్‌కు సంబంధించి కొన్ని అంశాలను లేవనెత్తింది.
షెల్ సంస్థల ద్వారా అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, మోసానికి పాల్పడిందని ఇది ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్ భారీగా పడిపోయాయి. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అప్పటి నుంచి అధానీ ఎలాంటి కొనుగోళ్లు జరపలేదు. తాజాగా ట్రైన్‌మ్యాన్ కొనుగోలుతో అదానీ గ్రూప్ తిరిగి పుంజుకున్నట్లు పలువురు చెబుతున్నారు. అదానీ గ్రూప్ గతంలో అనే కంపెనీలను సొంతం చేసుకుంది. అందులో ఎన్డీటీవీ కూడా ఒకటి.


Click it and Unblock the Notifications