Adani Defence: అదానీ కంపెనీలో ఇజ్రాయెల్ పిస్టల్స్.. ప్రత్యేకత ఏమిటంటే..
Adani Defence: ఇందుగలడు అందు లేడు అన్నట్లుగా ఏ వ్యాపారంలో చూసినా అదానీ గ్రూప్ కనిపిస్తోంది. దాదాపు 3-4 ఏళ్లుగా ఈ దూకుడు వ్యాపార విస్తరణను గౌతమ్ అదానీ కొనసాగిస్తున్నారు. ఏకంగా ప్రపంచ కుబేరుల్లో మూడో వ్యక్తికి చేరుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు.
ఇజ్రాయెల్ ప్రత్యేకంగా రూపొందించిన ఫేమస్ మసాదా పిస్టల్స్ ఇకపై భారతదేశంలోనే తయారు కానున్నాయి. వీటిని అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్నతో ఒప్పందం తర్వాత సాద్‌లోని డిఫెన్స్ కారిడార్‌లో అదానీ డిఫెన్స్ దీనిని నిర్మిస్తుంది. రానున్న కాలంలో కాన్పూర్‌లో తయారైన ఈ పిస్టల్‌ను భారత సైనిక సేవలకు వినియోగించనున్నారు. ఇదే క్రమంలో వీటిని ఇతర దేశాలకు సైతం ఇక్కడి నుంచి ఎగుమతి చేయవచ్చని తెలుస్తోంది.

మసాదా పిస్టల్ ప్రత్యేకతలను పరిశీలిస్తే.. ఒక్కసారి బోల్ట్ చేస్తే 17 రౌండ్లు కాల్చగలదు. దీని పరిధి 400 మీటర్ల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు దీనిని నేవీకి చెందిన మార్కస్ కమాండోస్ దేశంలో ఉపయోగిస్తున్నారు. ఇకపై ఇది ఆర్మీ , ఎయిర్ ఫోర్స్‌కు కూడా సరఫరా చేయబడుతుంది. గతంలో వీటిని దిగుమతి చేసుకోవటం వల్ల అధిక ధర ఉండేవి. కానీ ఇకపై ఇండియాలో తయారు చేయటం కారణంగా ఖర్చు తగ్గనుందని తెలుస్తోంది. తయారీ విషయాన్ని అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు.
2017లో ప్రారంభించిన ఈ మోడల్‌ను IWI ఇజ్రాయెల్ తయారు చేస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఆయుధాల తయారీ కంపెనీతో అదానీ డిఫెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పరిశ్రమల శాఖ డిప్యూటీ కమిషనర్ సుధీర్ శ్రీవాస్తవ తెలిపారు. కాన్పూర్‌లో అదానీ డిఫెన్స్ ఏర్పాటు చేయనున్న ఇమ్యునైజేషన్ కాంప్లెక్స్‌లో మసాదా పిస్టల్‌తో సహా 41 రకాల ఆయుధాలను తయారు చేసేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications