Adani Defence: 2024 మరికొద్ది రోజుల్లో ముగియనున్నప్పటికీ అదానీ షాపింగ్ మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఆసియాలో అత్యంత సంపన్నుల్లో ముందు వరుసలో ఉన్న గౌతమ్ అదానీ తన వ్యాపారాలను విస్తరించే పనిని ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం పవర్, నిర్మాణ రంగాల తర్వాత ఏవియేషన్ రంగంపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
అదానీ గ్రూప్ వేగంగా కొత్త వ్యాపారాల్లోకి తన విస్తరణను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ & టెక్నాలజీస్ లిమిటెడ్.. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీ ఎయిర్ వర్క్స్ ఇండియాలో రూ.400 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువకు 85.8% వాటాను కొనుగోలు చేసేందుకు ఖచ్చితమైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ డీల్ ఇండియాకు ఎయిర్ క్రాఫ్ట్స్ నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్ (MRO) సెక్టార్‌లో గణనీయమైన అభివృద్ధికి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఎయిర్ వర్క్స్ విమానయాన సేవల రంగంలో కీలక సంస్థగా ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీకి ఇండియాలో దాదాపు 35 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సామర్థ్యం ఉంది.

ప్రస్తుతం ఎయిర్ వర్క్స్ కంపెనీ దాదాపు 1300 మంది సిబ్బందిని కలిగి ఉంది. కంపెనీ కార్యకలాపాలను పరిశీలిస్తే.. లైన్ మెయింటెనెన్స్, హెవీ చెక్‌లు, ఫిక్స్‌డ్-వింగ్ అండ్ రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ఏవియానిక్స్ వర్క్‌లతో సహా విస్తృత శ్రేణి సేవలను అందిస్తోంది. ఇది 20కి పైగా అంతర్జాతీయ పౌర విమానయాన అధికారుల నుంచి ధృవీకరణలతో హోసూర్, ముంబై, కొచ్చిలో నారో బాడీ, టర్బోప్రాప్ విమానాల కోసం బేస్ మెయింటెనెన్స్‌ను కూడా నిర్వహిస్తుంది. ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే వాణిజ్య విమానాలతో పాటు రక్షణ రంగంలోని ఎక్విప్మెంట్‍కి కూడా ఎమ్ఆర్ఓ సెవలను అందించటానికి నైపుణ్యాలను అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే విమానాల కోసం ప్రాజెక్ట్‌లను చేపట్టింది.
దీని ప్రకారం రానున్న రోజుల్లో భారత రక్షణ రంగంలో కూడా అదానీ గ్రూప్ కీలక భాగస్వామిగా మారే అవకాశాలను ఇది సూచిస్తోంది. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద రక్షణ రంగంలో దేశీయ సామర్థ్యాలను పెంపొందించడానికి అదానీ గ్రూప్ తాజా ప్రయత్నాలు దోహదపడతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజా డీల్ దేశంలోని వాణిజ్య ఆపరేటర్లతో పాటు సాయుధ దళాల నిర్వహణ అవసరాలను తీర్చడం అదానీ గ్రూప్ విస్తరణకు వీలు కల్పిస్తుందని అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ తాజా ఒప్పందంపై స్పందిస్తూ.. పెరుగుతున్న భారతీయ విమానయాన రంగాన్ని హైలైట్ చేస్తూ ప్రస్తుతం భారత్ గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మారే మార్గంలో ఉందని అభిప్రాయపడ్డారు. తాజా ప్రయత్నం ఏవియేషన్ వాల్యూ చైన్‌లో కీలకమైన ఎంఆర్‌ఓ సెక్టార్‌లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications