అదానీ గ్రూప్ మళ్లి చిక్కుల్లో పడింది. గ్రూప్‌కు చెందిన ప్రధాన విభాగమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ రక్షణ విభాగం.. అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ పన్ను ఎగవేత కేసులో చిక్కుకుంది. క్షిపణి తయారీలో ఉపయోగించే భాగాలపై దిగుమతి సుంకాన్ని ఎగవేసినట్లు ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఈ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ దర్యాప్తు మార్చి 2025లో మొదలైంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. Adani డిఫెన్స్ సుమారు రూ. 77 కోట్లు (సుమారు 9 మిలియన్ డాలర్లు) విలువైన కస్టమ్స్ సుంకం, పన్నులను తప్పించుకుందని అధికారులు అనుమానిస్తున్నారు. కంపెనీ దిగుమతి చేసుకున్న కొన్ని క్షిపణి భాగాలను సుంకం నుండి మినహాయించబడిన వస్తువులుగా తప్పుగా వర్గీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం కంపెనీ యొక్క 2024-25 ఆర్థిక సంవత్సర ఆదాయం అయిన 76 మిలియన్ డాలర్లలో 10 శాతం కంటే ఎక్కువ. లాభాల పరంగా సగానికి పైగా అని సమాచారం.

ఈ ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్..DRI తమ దిగుమతులపై వివరణ కోరిందని ఆ వివరణను తగిన పత్రాలతో సమర్పించామని తెలిపింది. గ్రూప్ ప్రతినిధి మాట్లాడుతూ..కస్టమ్స్ నియమాల మా అర్థం ప్రకారం వివరణ ఇచ్చాము. సహాయక పత్రాలు కూడా సమర్పించాం. మా వైపు నుండి ఈ విషయం ముగిసిందని పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వ వర్గాల ప్రకారం.. దర్యాప్తు సమయంలో అదానీ అధికారులు దిగుమతి భాగాల వర్గీకరణలో పొరపాటు జరిగిందని అంగీకరించారని సమాచారం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో, కంపెనీ తప్పించుకున్న సుంకానికి సమానంగా 100 శాతం జరిమానా విధించబడుతుంది. అంటే ఈ కేసులో సుమారు 18 మిలియన్ డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉంది. దర్యాప్తు స్వల్ప-శ్రేణి ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల తయారీలో ఉపయోగించే భాగాలకు సంబంధించినది.
ఈ భాగాలు సాధారణంగా 10 శాతం దిగుమతి సుంకం, 18 శాతం స్థానిక పన్నుకు లోబడి ఉంటాయి. అయితే కంపెనీ వాటిని దీర్ఘ-శ్రేణి క్షిపణుల భాగాలుగా...సుంకం మినహాయింపు పొందే కేటగిరీగా చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదానీ డిఫెన్స్ తయారు చేసే ఉత్పత్తుల్లో క్షిపణులు, డ్రోన్‌లు, చిన్న ఆయుధాలు ఉన్నాయి. వీటిని ప్రధానంగా భారత భద్రతా దళాలు ఉపయోగిస్తాయి. ఆగస్టు నెలలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. మేలో పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణల్లో భారత సైన్యం అదానీ డ్రోన్‌లను ఉపయోగించిందని వెల్లడించారు.
కస్టమ్స్ రికార్డుల ప్రకారం.. అదానీ డిఫెన్స్ గత సంవత్సరం నుండి రష్యా నుండి 32 మిలియన్ డాలర్ల విలువైన పేలుడు కాని క్షిపణి భాగాలు, ఉపకరణాలు దిగుమతి చేసుకుంది. మొత్తంగా, జనవరి 2024 నుండి రష్యా, ఇజ్రాయెల్, కెనడా వంటి దేశాల నుండి 70 మిలియన్ డాలర్ల విలువైన రక్షణ భాగాలను దిగుమతి చేసినట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం, ఈ భాగాలు పేలుడు కాని పరికరాలు, క్షిపణి ప్రయోగ వ్యవస్థల ఉపకరణాలు, వీటిని స్వల్ప-శ్రేణి క్షిపణుల తయారీలో ఉపయోగిస్తారు.
అయితే ఈ దర్యాప్తు ఇప్పటివరకు బహిరంగం కాలేదు. కానీ ఇది అదానీ గ్రూప్‌కు మరో నియంత్రణ సవాల్‌గా మారింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పోర్టులు, ఎనర్జీ, ఫైనాన్స్ రంగాల్లో విస్తృతంగా వ్యాపారం చేసిన ఈ గ్రూప్‌పై ఇప్పటికే పలు నియంత్రణ సంస్థల దృష్టి ఉంది. ఇప్పుడు రక్షణ విభాగంపై వస్తున్న పన్ను ఎగవేత ఆరోపణలు భారత రక్షణ రంగంలో పారదర్శకతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications