Adani Defence: ఇన్నాళ్లు దేశంలోని అనేక వ్యాపారాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న గౌతమ్ అదానీ.. మరో రంగంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తున్నారు. అదే డిఫెన్స్ సెక్టార్. ప్రస్తుతం శరవేగంగా ఈ రంగంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలను అదానీ గ్రూప్ స్పీడ్ పెంచింది. అలా ఈ రంగంలో మరో కంపెనీని హస్తగతం చేసుకునేందుకు డీల్ కుదుర్చుకుంటోంది.

దేశ రక్షణలో..
గత కొంత కాలంగా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం విదేశాల నుంచి దిగుమతులను సైతం చాలా వరకు తగ్గించింది. రక్షణ సామాగ్రిని దేశీయ కంపెనీల నుంచే సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2017లో రక్షణ రంగంలోకి వచ్చిన అదానీ గ్రూప్.. అవకాశాలను అందిపుచ్చుకోవటం కోసం పావులు కదుపుతోంది.

పోర్ట్‌ఫోలియో..
రక్షణ కంపెనీల పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తోంది. అలా గడచిన ఐదేళ్ల కాలంలో ఆల్ఫా డిజైన్స్ కంపెనీని సొంతం చేసుకుంది. తాజాగా ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ సర్వీసెస్ ప్రొవైడర్ ఎయిర్ వర్క్స్ కంపెనీని రూ.400 కోట్లు వెచ్చింది సొంతం చేసుకుంటోంది. దీని ద్వారా అదానీ గ్రూప్ MRO సర్వీసెస్ లోకి ప్రవేశిస్తోంది. ఈ ప్రవేశం ఎయిర్ బస్, బోయింగ్, సాఫ్రాన్ ఎస్ఏ వంటి గ్లోబల్ కంపెనీలతో సంబంధాలను పెంచుకోవటంలో సహాయపడుతుందని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ రాజ్‌వంశీ వెల్లడించారు.

రానున్న 5 ఏళ్లలో..
ఎయిర్ వర్క్స్ కంపెనీ 70 ఏళ్ల నుంచి ఈ వ్యాపారంలో ఉంది. రానున్న ఐదు సంవత్సరాల్లో MRO వ్యాపారం 5 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు రాజవంశీ తెలిపారు. అదానీ డిఫెన్స్ కేవలం లైన్ అండ్ బేస్ మెయింటెనెన్స్‌పై దృష్టి పెట్టడమే కాకుండా కాంపోనెంట్ మరియు ఇంజన్ MROలోకి విస్తరించాలని చూస్తోంది.

ప్రపంచ ప్రత్యామ్మాయంగా..
టాక్స్ సమస్యల కారణంగా అనేక విమానాలు మెయింటెనెన్స్ కోసం కొలంబియా, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు వెళ్లవలసి వస్తోంది. అయితే ఈ రంగంలోకి అదానీ గ్రూప్ అరంగేట్రం చేయటం పెను మార్పును తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ ఇప్పటికే అనేక కీలకమైన వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో తన సేవలను అందిస్తోందని తెలుస్తోంది.

కొత్త కొలువులు..
నాలుగో వ్యూహాత్మక ఫోకస్ ఏరియాలో భాగంగా అదానీ డిఫెన్స్ ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ కారిడార్‌లో పెట్టుబడులు పెడుతోంది. కంపెనీ కాన్పూర్‌లోని 500 ఎకరాల్లో అతిపెద్ద రక్షణ మందుగుండు సామగ్రి సముదాయాన్ని ఏర్పాటు చేయనుంది. అదానీ గ్రూప్ రాబోయే ఐదేళ్లలో తన రక్షణ పోర్ట్‌ఫోలియో కోసం 10,000 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. రానున్న కాలంలో కంపెనీ ఇతర దేశాలకు తన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications