అమెరికా సంస్థ హిండెన్ బెర్గ్ రీసెర్చ్ నివేదిక అనంతరం అదానీ గ్రూపు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రస్తుత తరుణంలో పునరుత్పాదక శక్తి వనరులకు దేశంలో డిమాండ్ పెరిగింది. దీంతో అదానీ పవర్ అడ్డంకులను అధిగమిస్తూ, కొత్త రికార్డులను నెలకొల్పుతూ ముందుకు సాగుతోంది.
దీపావళి పర్వదినాన ముంబై నగరంలో 4 గంటల పాటు అదానీ ఎలక్ట్రిసిటీ విద్యుత్ సరఫరా చేసింది. అయితే ఇది పూర్తిగా పునరుత్పాదక వనరుల నుంచి తయారుచేసిన పవర్ కావడం విశేషం. ఈ మేరకు పవర్ యుటిలిటీ కంపెనీ అదానీ ఎలక్ట్రిసిటీ సోమవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

అదానీ ఎలక్ట్రిసిటీ తన 3 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ ను సరఫరా చేసింది. ఇందుకోసం 1,200 MW ఎలక్ట్రిసిటీని వినియోగించింది. అంటే ఆర్థిక రాజధాని ముంబై నగరం విద్యుత్ అవసరాలలో 40 శాతానికి పైగా రెన్యువబుల్ ఎనర్జీ నుంచే సేకరించబడింది.
ముంబైకి సరఫరా చేయబడిన ఈ విద్యుత్‌లో ఎక్కువ భాగం ప్రక్కనే ఉన్న ప్రాంతాల నుంచి ఉత్పత్తి అవుతోంంది. కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడటానికి తమ ప్లాంట్ నుంచి పర్టిక్యులేట్ మ్యాటర్ ఉద్గారాలను సగానికి తగ్గించాలని ప్రత్యర్థి విద్యుత్ ఉత్పత్తి సంస్థను మహారాష్ట్ర అధికారులు కోరారు. ఇందుకుగాను సోలార్ మరియు పవన విద్యుత్ ద్వారా సోర్సింగ్ చేయడానికి ముందుగానే ప్లాన్ చేసినట్లు అదానీ ఎలక్ట్రిసిటీ తెలిపింది.
'100 శాతం పునరుత్పాదక శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం.. ముంబై ఇంధన పరివర్తనలో మొదటి, ముఖ్యమైన మైలురాయి. విశ్వసనీయ, స్థిరమైన విద్యుత్‌తో నగరాన్ని గణనీయంగా శక్తివంతం చేయగలమని నమ్ముతున్నాం' అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కందర్ప్ పటేల్ తెలిపారు. 2023లో వీటిద్వారా సరఫరా చేసిన మొత్తం విద్యుత్ లో 38 శాతం అదానీ కంపెనీ సోర్స్ చేయగా.. 2027 నాటికి 60 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications